18 Years Of Pokiri: The Hero, Heroines Who Missed Pokiri Movie

18 Years Of Pokiri: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మూవీకి నేటితో 18 సంవత్సరాలు పూర్తయ్యాయి.ఈ సినిమా 2006 ఏప్రిల్ 28న విడుదలైంది. దీంతో ఈ సినిమా విడుదలై ఈరోజుతో 18 సంవత్సరాలు పూర్తయ్యాయి.అయితే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పోకిరి సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఛాన్స్ ని మిస్ చేసుకున్న వాళ్లు ఎవరో కూడా ఇప్పుడు చూద్దాం.

18 Years Of Pokiri: The Hero ,Heroines Who Missed Pokiri Movie

పూరి జగన్నాథ్ పోకిరి మూవీని బద్రి సినిమా కంటే ముందే తీయాలి అనుకున్నారట. ఇక ఈ సినిమా కోసం మొదట్లో మహేష్ బాబుని కాకుండా రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి హీరోలను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరు హీరోలు ఆ సినిమాలో నటించలేదు. చివరికి ఈ సినిమా కథని మహేష్ బాబుకి చెప్పడంతో ఆయన ఓకే చేశారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా ముందుగా ఇలియానాని అనుకోలేదట. మొదట్లో బాలీవుడ్ నటి ఆయేషా టాకీయాని అనుకున్నప్పటికీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట.(18 Years Of Pokiri)

Also Read: Premisthe: “ప్రేమిస్తే” మూవీలో సంధ్య పాత్రని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

ఆ తర్వాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఆమె బాలీవుడ్ లో నటించే ఓ సినిమా కోసం అలాగే పోకిరి సినిమా రెండూ ఒకేసారి ఆడిషన్స్ జరగడంతో బాలీవుడ్ మూవీ తో పాటు పోకిరి మూవీకి కూడా ఆడిషన్ ఇచ్చిందట.ఇక ఈమె అదృష్టం ఏంటంటే రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కానీ ఏదో ఒక సినిమా మాత్రమే ఒప్పుకోవాలి కాబట్టి తెలుగు సినిమా పోకిరిని రిజెక్ట్ చేసి బాలీవుడ్ మూవీలో నటించింది.ఇక పోకిరి మూవీ కంగనా రిజెక్ట్ చేయడంతో అది కాస్త ఇలియానా చేతికి వచ్చింది.

18 Years Of Pokiri: The Hero, Heroines Who Missed Pokiri Movie

అలా పోకిరి మూవీ అటు మహేష్ బాబు తో పాటు ఇటు ఇలియానా కు కూడా మంచి స్టార్డం తెచ్చిపెట్టింది. సినిమాతో మహేష్ బాబు రేంజ్ మాత్రమే కాదు ఇలియానా రేంజ్ కూడా టాలీవుడ్ లో పెరిగింది. అంతే కాకుండా పోకిరి సినిమాలో మహేష్ బాబుని అప్పటివరకు చూడని లుక్ లో చూశారు. అలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టింది.అంతేకాకుండా పోకిరి మూవీకి ముందుగా సన్నాఫ్ సూర్యనారాయణ, ఉత్తమ్ సింగ్ వంటి టైటిల్స్ ని అనుకున్నారట.కానీ చివరికి పోకిరి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమా 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 40 కోట్ల షేర్,70 కోట్ల గ్రాస్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. (18 Years Of Pokiri)

Join WhatsApp