20Years Of Arya: Is Allu Arjun the first choice for Arya movie

20Years Of Arya: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ప్రేమ కథా సినిమా ఆర్య.. అల్లు అర్జున్ సరసన అనురాధ మెహతా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ తో అప్పటి ఎంతో మంది యూత్ ని ఆకట్టుకున్నారు డైరెక్టర్.. ఇందులో శివ బాలాజీ కూడా కీలక పాత్రలో నటించారు. అయితే అలాంటి యూత్ మెచ్చిన ఈ ప్రేమ కథా సినిమా ఆర్య మే 7,2004లో విడుదలై మొదటి షో కాస్త నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత నుండి ఈ సినిమాకి యూత్ బ్రహ్మరథం పట్టారు.

20Years Of Arya: Is Allu Arjun the first choice for Arya movie

అలా ఈ మూవీ దాదాపు 125 రోజులు కొన్ని థియేటర్లలో ఆడి బ్లాక్ బస్టర్ అయింది.అయితే అలాంటి ఈ మూవీ విడుదలై నేటికీ అంటే 2024 మే 7 కి 20 సంవత్సరాలు పూర్తయింది.ఇక 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు 20 ఇయర్స్ ఆఫ్ ఆర్య కి సంబంధించి ఆర్య మూవీ లో నటించిన నటినటులు, పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ కలిపి ఒక పార్టీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.(20Years Of Arya)

Also Read: Kovai Sarala: నేను ఈ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలంటే.. ఆ స్టార్ హీరోనే చేసుకుంటా.. సరళ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇక 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 30 కోట్ల వసూళ్లు సాధించింది. అంతేకాదు దీన్ని తమిళంలో కూడా డబ్ చేయగా అక్కడ కూడా 35 లక్షల వరకు వసూలు చేసింది. అలా రెండో సినిమాతోనే అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అయితే అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీని డైరెక్టర్ సుకుమార్ ముందుగా అల్లు అర్జున్ కోసం కాకుండా అల్లరి నరేష్ కోసం రాసుకున్నారట.

20Years Of Arya: Is Allu Arjun the first choice for Arya movie

కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ని అల్లరి మూవీలో చూసి ఆయన కోసమే ఈ కరాసుకున్నారట. కానీ ఆ తర్వాత ఇది అల్లు అర్జున్ కి చెప్పగా ఆయనకి కథ నచ్చి సినిమా ఓకే చేశారు. అలా అల్లరి నరేష్ కోసం రాసిన సినిమా అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చింది.అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్, రవితేజ,నితిన్ వంటి హీరోలను తీసుకోవాలని కూడా ముందుగా సుకుమార్ అనుకున్నారట.(20Years Of Arya)

Join WhatsApp