#25 Years Of Raja movie

#25 Years Of Raja: వెంకటేష్ సౌందర్య కాంబినేషన్లో వచ్చిన రాజా సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీనే.. ఈ మూవీ ఎప్పుడు చూసినా కూడా బోర్ కొట్టదు.ఎప్పుడు టీవీలలో వచ్చినా కూడా చాలామంది సినీ ప్రేక్షకులు కల్లార్పకుండా ఈ మూవీ ని చూస్తారు.మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ సౌందర్య జోడి చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమా వల్ల వెంకటేష్ సౌందర్య జంటకి చాలామంది ప్రత్యేక అభిమానులుగా మారిపోయారు.

#25 Years Of Raja movie

రాజా మూవీలో వెంకటేష్ ముందు దొంగ క్యారెక్టర్ లో నటించి ఆ తర్వాత మారిపోయి సౌందర్యకు సపోర్ట్ చేస్తూ అమాయకపు పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. అయితే అలాంటి రాజా మూవీ విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఉన్నిడతేల్ ఎన్నై కొడుతేన్ అనే మూవీకి రీమేక్.. తమిళ్ మూవీ లో కార్తీక్,రోజాలు హీరో హీరోయిన్స్ గా చేశారు.(#25 Years Of Raja)

Also Read: Nithiin: జయం, దిల్ చిత్రాల్లో నితిన్ కు డ‌బ్బింగ్ చెప్పిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో తెలుగులో దీన్ని వెంకటేష్ రోజా కాంబినేషన్లో తీయాలి అనుకున్నారట.అయితే ఈ సినిమా తీసే సమయంలో రోజాకి డేట్స్ ఖాళీగా లేకపోవడం కారణంగా సౌందర్యను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. దాంతో చిత్ర యూనిట్ సౌందర్యను సంప్రదించి ఆమె ఓకే చెప్పగానే ఆమెను హీరోయిన్గా తీసుకున్నారట.

#25 Years Of Raja movie

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి విడుదలైన కొద్ది రోజులకు వెంకటేష్ రోజా మధ్య మాటలు లేవని ఓ టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. అంతే కాదు వెంకటేష్ తన సినిమాలో రోజాని హీరోయిన్ గా తీసుకోకపోవడం వల్లే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని ఇప్పటికి కూడా ఇద్దరూ బద్ద శత్రువులుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక రాజా మూవీ 1999 మార్చి 18న విడుదలైంది.(#25 Years Of Raja)

Join WhatsApp