A bangalore woman cheated by in the name of Rajinikanth

Rajinikanth: సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని.. అగ్ర నటీనటులతో తెర పంచుకోవాలని ఎంతో మంది ఆశపడుతుంటారు. అయితే ఆ ఆశను కొందరు కేటుగాళ్లు ఆసరాగా తీసుకుంటున్నారు. అమాయకుల దగ్గర డబ్బు గుంజుకునేందుకు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్పి భారీ స్కామ్ కు పాల్ప‌డ్డారు. ఇందులో మృదుల‌ అనే యువతితో పాటు ఎంతో మంది చిక్కుకొని లక్ష‌లకు లక్షలు పోగొట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

A bangalore woman cheated by in the name of Rajinikanth

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్ లో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసింది. తలైవర్ 171 వర్కింగ్ టైటిల్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ వారు ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే బెంగ‌ళూరుకు చెందిన‌ కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా తీసుకుని సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన ఇచ్చారు. తలైవర్ 171 చిత్రంలో నటించేందుకు నటీనటులు కావాలంటూ ఆడీషన్ కి పిలుపునిచ్చారు.

రజినికాంత్ సినిమా కావడంతో చాలా మంది ఆ పోస్టులో ఉన్న అడ్రస్ కు వెళ్లారు. అక్కడ కొందరు వ్య‌క్తుల‌ను త‌మ‌ను తాము కాస్టింగ్ డైరెక్టర్స్ గా పరిచయం చేసుకున్నారు. ఆడీష‌న్ కు వ‌చ్చిన వారికి మాయ మాట‌లు చెప్పి భారీ మొత్తంలో డబ్బులు లాగేశారు. ఈ జాబితాలో మృదుల అనే యువతి కూడా ఉంది. అయితే డబ్బు ఇచ్చిన తర్వాత తను మోసపోయానని మృతుల గ్రహించింది. వెంటనే ఆమె బెంగుళూరు పోలీసుల‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.(Rajinikanth)

Also Read: Samantha: జీవితంలో మ‌ళ్లీ ఆ ప‌ని చేయ‌ను.. వైర‌ల్ గా మారిన స‌మంత లేటెస్ట్‌ కామెంట్స్‌!

ఈ స్కామ్ కు లీడర్ గా సురేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడని.. అతనికి తాను రూ. 3.9 లక్షలు ఇచ్చానని మృదుల ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. మృదుల‌తో పాటు మ‌రెంతో మంది ఈ స్కామ్ లో గుడ్డిగా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నారని గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు రజినీకాంత్ పేరుతో స్కామ్ కు పాల్పడిన కేటుగాళ్ల‌ను పట్టుకునే పనిలో ఉన్నారు.

Join WhatsApp