A Special Talent In Director Prasanth Varma

Prasanth Varma: ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఈ పేరు మారుమోగిపోతోంది. అ!, క‌ల్కీ, జాంబీ రెడ్డి వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా ఏంటో చూపించిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ఇటీవ‌ల విడుద‌లైన హ‌నుమాన్ తో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాడు. సూప‌ర్ హీరో స్టోరీతో రూపుదిద్దుకున్న హ‌నుమాన్ చిత్రంలో యువ న‌టుడు తేజ స‌జ్జ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేశాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న తెలుగు, త‌మిళ్, కన్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అయింది.

A Special Talent In Director Prasanth Varma

మ‌హేష్ బాబు, నాగార్జున‌, వెంక‌టేష్ వంటి అగ్ర‌హీరోల సినిమాల‌తో పోటీ ప‌డుతూ థియేట‌ర్స్ లోకి దిగిన హ‌నుమాన్ అఖండ విజ‌యాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. సంక్రాంతి బ‌రిలో ఉన్న అన్ని సినిమాల‌ను తొక్కుకుంటూ అనేక రిక‌ర్డుల‌ను తిర‌గ‌రాసింది. రూ.250 కోట్లుకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి సంక్రాంతి విన్న‌ర్ గా నిలిచింది. ఇప్ప‌టికీ థియేట‌ర్స్ లో హ‌నుమాన్ హ‌వా కొన‌సాగుతూనే ఉండ‌టం విశేషం.

A Special Talent In Director Prasanth Varma

హనుమాన్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ పేరు అటు సోష‌ల్ మీడియాతో పాటు ఇటు ప్ర‌ధాన మీడియాలోనూ మారుమోగిపోయింది. తన సినిమాటిక్‌ యూనివర్స్‌తో మూవీ ల‌వ‌ర్స్ ను ఎంత‌గానో ఆకట్టుకున్న ప్రశాంత్‌ వర్మకి సంబంధించి ఎన్నో వివారాలు బ‌య‌ట‌కు వస్తున్నాయి. ఇటీవ‌లె ఆయ‌న ఓ ఈవెంట్‌లో తన భార్య సుకన్యను పరిచయం చేసి షాకిచ్చాడు. యంగ్ లుక్ లో క‌నిపిస్తున్న ప్ర‌శాంత్ వ‌ర్మ సింగిలే అని అంతా అనుకున్నారు. కానీ, అత‌ను ఎప్పుడో మింగిల్ అయ్యాడ‌ని తెలిసి.. అమ్మాయిలు తెగ ఫీల్ అయిపోయారు.(Prasanth Varma)

Also Read: Prabhas: స‌మంత రూట్ లోనే ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్ ఈ చేదు వార్త‌ విని త‌ట్టుకోగ‌ల‌రా..?

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు సంబంధించి మ‌రో క్రేజీ మ్యాట‌ర్ బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాదు క్రికెట్ కూడా చాలా అద్భుతంగా ఆడ‌తాడు. ఈ స్పెష‌ల్ టాలెంట్ కూడా అత‌నిలో ఉంది. చిన్న‌త‌నం నుంచి సినిమాల‌ను ఎంత‌లా ఇష్ట‌ప‌డ్డాడో.. క్రికెట్ ను కూడా అంతే లైక్ చేశాడు. స్కూల్, కాలేజీ లెవెల్స్ నుంచి క్రికెట్ ఆడుతూ వచ్చాడు. ఆ త‌ర్వాత డిస్ట్రిక్ లెవల్ లో ఆడి ప‌లు ప్రైజ్‌లు గెలుచుకున్నాడు. అక్క‌డితో ఆగ‌కుండా అనేక‌ ప్రైవేట్ టోర్నమెంట్స్ లో కూడా ఆడి మంచి క్రికెట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈయ‌న బ్యాట్స్ మెన్ మ‌రియు బౌలర్ కూడా. పలు టోర్నమెంట్స్ లో హైయ్యెస్ట్ రన్స్ సాధించి బెస్ట్ బ్యాట్స్ మెన్, బౌలింగ్ లో తన సత్తా చూపించి బెస్ట్ బౌలర్ అవార్డులు అందుకున్నాడు. ఈ విష‌యం తెలిసి అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వీడు మామూలోడు కాదంటూ ప్ర‌శాంత్ వ‌ర్మ‌పై కామెంట్స్ పెడుతున్నారు.

Join WhatsApp