Actor Arjun Sarja Daughter Anjana Sarja Does Crazy Business

Anjana Sarja: యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ర్జా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కూడా ఆయ‌న సుప‌రిచిత‌మే. ఒక‌ప్పుడు టాప్ హీరోగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసిన‌ అర్జున్‌.. ప్ర‌స్తుతం స‌హాయ‌క నటుడిగా, విల‌న్ గా మ‌రియు ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగించేందుకు అర్జున్ పెద్ద కూతురు ఐశ్వ‌ర్య స‌ర్జా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టింది.

Actor Arjun Sarja Daughter Anjana Sarja Does Crazy Business

విశాల్ సరసన పట్టతు యానై అనే త‌మిళ సినిమాలో న‌టించి హీరోయిన్ గా త‌న సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడలో ప్రేమ బరహ చిత్రంలో నటించింది. 2013లోనే ఐశ్వ‌ర్య ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినా.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక‌పోయింది. ఇప్పుడిప్పుడు అవ‌కాశాలు పెరుగుతున్న త‌రుణంలో ఐశ్వ‌ర్య వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయింది.

తమిళ న‌టుడు తంబీ రామయ్య కొడుకు, హీరో ఉమాపతి రామయ్యతో ఏడ‌డుగులు వేయబోతోంది. గ‌త కొంత కాలం నుంచి ఉపాప‌తి, ఐశ్వ‌ర్య ప్రేమ‌లో ఉన్నారు. పెద్ద‌లు కూడా వారి ప్రేమ‌ను అంగీకరించ‌డంతో.. గ‌త ఏడాది చివ‌ర్లో చెన్నై వేదిక‌గా అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది వీరి పెళ్లి వేడుక ఉంటుంద‌ని అంటున్నారు. ఇక‌పోతే అర్జున్ స‌ర్జాకు ఐశ్వ‌ర్య‌తో పాటు మ‌రో కూతురు కూడా ఉంది. ఆమె పేరు అంజ‌నా స‌ర్జా.(Anjana Sarja)

Also Read: Puri Jagannath: లావణ్య కి విడాకులు ఇచ్చి స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న పూరి… దారుణంగా ఏకేస్తున్న ప్రేక్షకులు..!

హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా అంజ‌నా ఉంటుంది. కానీ, తండ్రి బాట‌లో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేందుకు ఆమె మొగ్గు చూప‌డం లేదు. అంజ‌నా వ్యాపార‌రంగంలో అడుగు పెట్టింది. న‌యా బిజినెస్ ను ప్రారంభించింది. హైదరాబాద్‏లో హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ యూనిట్ కు ఆమె ఫౌండ‌ర్ గా ఉన్నారు. అయితే ఈ సంస్థ‌లో హ్యాండ్ బ్యాగులకు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. వీటి త‌యారీకి ముడి పదార్థంగా పండ్ల తొక్కలను వాడ‌తారు. విన‌డానికి వెరైటీగా ఉన్నా ఇది నిజం. పండ్ల తొక్కలను వాడి ప్రత్యేకమైన ఫార్ములాతో హ్యాండ్ బ్యాగ్స్ ను త‌యారు చేయ‌డ‌మే అంజ‌నా సంస్థ యొక్క స్పెషాలిటీ. ఈ పద్దతి ప్రపంచంలో మునుపెన్నడూ ప్రయత్నించలేదు. కానీ, అంజ‌నా మాత్రం భిన్నంగా ఆలోచిస్తూ త‌న రూటే స‌ప‌రేటు అని నిరూపించుకుంటోంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఇటువంటి సంస్థను ప్రారంభించిన‌ అంజనాపై ప్ర‌శంస‌లు కురిపించారు.

Join WhatsApp