Actor Kishore Kumar interesting comments

Kishore Kumar: ఇండస్ట్రీలో పెద్దపెద్ద నటులే సినిమాలో తాము ఉన్నామా లేదా అనేది బిగ్ స్క్రీన్ పై చూసుకుంటేనే కానీ క్లారిటీ ఉండటం లేదు. మరి చిన్న నటుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వారు ఎంతో కష్టపడి నటించినా ఆ సీన్స్ ను వారికి నచ్చకపోతే ఒక్క ఎడిటింగ్ తో తీసి పడేస్తారు. ఇక అలా ఆ సినిమా నుంచి తీసి పడేసిన యాక్టర్స్ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇక ఒక చిన్న నటుడు పరిస్థితి ఇండస్ట్రీలో ఏ విధంగా ఉందో తాజాగా కిషోర్ కుమార్ పొలిమేర అనే యాక్టర్ వెల్లడించారు.

Actor Kishore Kumar interesting comments

భీమ్లా నాయక్ మరియు ఆచార్య వంటి సినిమాల్లో తాను నటించినప్పటికీ అవి ఎడిటింగ్ లో తీసేసినట్లు తెలిపాడు కిషోర్. మరి ఆ నటుడు విషయంలో ఎందుకలా జరిగింది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంటేనే నిలదొక్కుకోగలం అనేది కొంతమంది నటుల మాట. చాలావరకు ఇదే నిజం కూడా. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే మరికొన్ని సినిమాల్లో నటించాక తన క్యారెక్టర్ లేకుండా చేశారని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Also Read: Venu Swamy: ఆ హీరోయిన్ విడాకులు నిజమే.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.!!

” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మరియు ఆచార్య సినిమాలో నటించాను. కానీ భీమ్లా నాయక్ సినిమాలో ఒకరోజు షూటింగ్ జరిగిన తర్వాత నా రోల్ ను ఇంకొకరితో రీప్లేస్ చేశారు. నటించాక కూడా ఆ సినిమాల్లో నేను లేకపోవడం బాధగా అనిపించింది. ఆ రెండు సినిమాల్లో ఎందుకు అలా జరిగింది అంటే ఆ సినిమా షూటింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు కానీ కొంతమంది నటులను రీప్లేస్ చేశారు.

Actor Kishore Kumar interesting comments

అదే సమయంలో నేను షూటింగ్లో పాల్గొన్న తర్వాత కూడా అవకాశాన్ని కోల్పోయాను. ఆ తరువాత చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య మూవీలో కూడా ఇలాగే జరిగింది. ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చింది. దాదాపు 20 రోజులపాటు ఆ సినిమా కోసం పని చేశాను. మెగాస్టార్ బాగా నటించావు అని ప్రశంసలు సైతం కురిపించారు. కానీ తీరా చూస్తే సినిమాలో నేను లేను. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ సాధారణమే. ఒకప్పుడు తెగ బాధపడే వాడిని కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది ” అంటూ చెప్పుకొచ్చాడు కిషోర్ కుమార్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.(Kishore Kumar)

Join WhatsApp