Actor Nikhil Siddhartha and Pallavi Blessed With A Baby Boy

Nikhil: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి నిఖిల్ సిద్ధార్థ.. సహాయ దర్శకుడిగా కెరీర్ మొద‌లు పెట్టాడు. ఆ త‌ర్వాత చిన్న చిన్న పాట‌ల‌తో న‌టుడి మారి హీరోగా ఎదిగాడు. త‌న‌దైన టాలెంట్ తో ప్రాంతీయ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హీరోగారు ఫాద‌ర్ గా ప్ర‌మోట్ అయ్యాడు. నిఖిల్ స‌తీమ‌ణి ప‌ల్ల‌వి వ‌ర్మ బుధ‌వారం పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. నిఖిల్‌, ప‌ల్ల‌వి దంప‌తులు త‌మ మొద‌టి సంతానంగా బేబీ బాయ్‌కు వెల్క‌మ్ చెప్పారు.

Actor Nikhil Siddhartha and Pallavi Blessed With A Baby Boy

ఈ స్వీట్ న్యూస్ ను నిఖిల్ టీమ్‌ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం నిఖిల్ త‌న ముద్దుల త‌న‌యుడిని ప్రేమ‌గా ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటో ఒకటి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో అభిమానులు, సినీ ప్రియులు మ‌రియు ప‌లువురు సెల‌బ్రిటీలు నిఖిల్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మ‌రోవైపు నిఖిల్‌, ప‌ల్ల‌వి ఫ్యామిలీ మెంబ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్ లో మునిగిపోయారు.

2020లో భీమ‌వ‌రంకు చెందిన డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌తో నిఖిల్ పెళ్లి పీట‌లెక్కాడు. వీరిది ల‌వ్ మ్యారేజ్‌. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో నిఖిల్‌-ప‌ల్ల‌వి వివాహం హైద‌రాబాద్‌లోని ఓ రిసార్ట్ లో నిడారంబరంగా జ‌రిగింది. పెళ్లి జ‌రిగిన నాలుగేళ్ల‌కు ఈ దంప‌తులు త‌మ లైఫ్‌లో మరొక వ్య‌క్తిని ఆహ్వానించారు. ఇటీవ‌లె భార్య ప్రెగ్నెన్సీ విష‌యాన్ని నిఖిల్ అందిరితో పంచుకున్నాడు. పైగా పుట్ట‌బోయే బిడ్డ కోసం డైప‌ర్ ఛేంజ్ క్లాసులు తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ప‌ల్ల‌వి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో నిఖిల్ ఆనందానికి అవుధులు లేకుండా పోయాయి.(Nikhil)

Also Read: Virat Kohli: కొడుకుకు అకాయ్ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ విరుష్క జంట.. ఇంత‌కీ ఆ పేరుకు అర్థ‌మేంటో తెలుసా?

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. నిఖిల్ ప్ర‌స్తుతం భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వ‌యంభూ అనే మూవీ చేస్తున్నాడు.హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాణంలో ది ఇండియన్‌ హౌజ్‌ అంటూ ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాను నిఖిల్‌ ప్రకటించాడు. అంతేకాకుండా కార్తికేయ 3 మూవీ కూడా ఆయ‌న లైన‌ప్ లో ఉంది.

Join WhatsApp