Actress Aksha Pardasany Married Cinematographer Kaushal

Aksha Pardasany: ఇటీవ‌ల టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు వ‌రుస‌గా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. గ‌త వార‌మే ప్ర‌ముఖు హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భ‌గ్నానీతో ఏడ‌డుగులు వేసింది. వీరి హ‌డావుడి మ‌ర‌వ‌క ముందే మ‌రో తెలుగు హీరోయిన్ పెళ్లి పీట‌లెక్కింది. ఆమె మ‌రెవ‌రో కాదు అక్షా పార్ధసాని. ముసఫిర్ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన అక్షా.. 2008లో వ‌చ్చిన యువత చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది.

Actress Aksha Pardasany Married Cinematographer Kaushal

ఆ త‌ర్వాత రైడ్, కందిరీగ, శత్రువు, బెంగాల్ టైగర్, డిక్టేటర్, రాధ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. హీరోయిన్ గానే కాకుండా స‌హాయ‌క పాత్ర‌ల‌ను కూడా పోషించింది. త‌న అందం, అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. అయితే స‌రైన స‌క్సెస్ రేటు లేక‌పోవ‌డం వ‌ల్ల 2017 త‌ర్వాత అక్షాకు ఆఫ‌ర్లు రాలేదు. అప్ప‌టి నుంచి వెండితెర‌కు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో వ‌రుస‌గా వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ను నెట్టికొస్తోంది.

Actress Aksha Pardasany Married Cinematographer Kaushal

ఇదిలా ఉండ‌గా.. అక్షా తాజాగా పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్ తో తన జీవితాన్ని పంచుకుంది. గ‌త‌కొన్నాల్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట‌.. ఫిబ్రవరి 26న గోవాలో గ్రాండ్ గా డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకున్నారు. కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితుల స‌మ‌క్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. త‌మ పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను అక్షా-కౌశ‌ల్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.(Aksha Pardasany)

Also Read: Stalin: చిరంజీవి సూప‌ర్ హిట్ మూవీ స్టాలిన్ ను చీప్ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

దీంతో అభిమానులు, నెటిజ‌న్లు మ‌రియు పలువురు సినీ ప్ర‌ముఖులు నూత‌న దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇక‌పోతే వివాహం చేసుకునేట‌ప్పుడు పెళ్లి కొడుకులు గుర్రం, కార్, రథం లాంటి వాటిల్లో ఊరేగింపుగా రావ‌డం స‌ర్వసాధార‌ణం. కానీ, అక్షాను వివాహం చేసుకునేందుకు కౌశల్ ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూస్తే ప‌డి ప‌డి న‌వ్వుతారు. కౌశల్ సినిమాటోగ్రాఫర్ కావడంతో షూటింగ్స్ కి వాడే కెమెరా క్రేన్ మీద కూర్చొని ఎంట్రీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఎంతైనా కెమెరామెన్ అనిపించుకున్నావ్ అంటూ కౌశ‌ల్ పై స‌ర‌దాగా సెటైర్లు పేలుస్తున్నారు.

Join WhatsApp