Actress Anjali To Marry Divorced Producer Soon

Anjali: ఆంధ్ర అమ్మాయి అంజలి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రాజోలు లో జన్మించిన అంజలి స్కూలింగ్ అనంతరం చెన్నైకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ డిగ్రీ చదువుతూనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం ప్రారంభించింది. మెల్లగా మోడలింగ్ లోకి ప్రవేశించింది. ఆ సమయంలోనే డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తన తెలుగు చిత్రం ఫోటో లో అంజలికి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. అలా ఫోటో మూవీతో అంజలి సినీ ప్రయాణం మొదలైంది. ఆ వెంటనే ప్రేమలేఖ రాశా అనే చిత్రంలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

Actress Anjali To Marry Divorced Producer Soon

తెలుగులో అంజలికి కూడా ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంజలి తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అక్కడ తన ప్రతిభతో వరుస చిత్రాలు చేస్తూ స్టార్ హోదాను అందుకుంది. కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ఇక చాలా కాలం తర్వాత 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో టాలీవుడ్‌లోకి అంజలి రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దాంతో టాలీవుడ్ లో కూడా అంజలికి ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి.(Anjali)

Also Read: Savitri: మహానటి సావిత్రిపై పగతో ఆ జర్నలిస్టు అంతలా టార్చర్ చేశారా.. రాళ్లతో కొట్టించి మరీ..!

ప్ర‌స్తుతం హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా అంజలి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాష‌ల్లో చిత్రాలు చేస్తూ అలరిస్తోంది. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. 37 ఏళ్లు వచ్చినా అంజలి ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. అంజలి ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా అని ఆమె అభిమానులు చాలా కాలం నుంచి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అంజలి పెళ్లంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కాబోతోందని అంజలి పై ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని అంజలి స్వ‌యంగా క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా అంజలి పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెర‌పైకి వచ్చింది.

Actress Anjali To Marry Divorced Producer Soon

ఒక టాలీవుడ్ ప్రొడ్యూసర్ తో అంజలి గ‌త‌ ఏడాది కాలం నుంచి సీక్రెట్ గా డేటింగ్ చేస్తోందని.. త్వరలోనే అతనితో ఏడడుగులు కూడా వెయ్యబోతోందని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కి ఇదివరకే పెళ్లి జరిగి విడాకులు కూడా అయ్యాయట. విడాకులైన ప్రొడ్యూసర్ తో అంజలి పెళ్లికి రెడీ అవుతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచార ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. కాగా అంజలి ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్, శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోంది. అలాగే బ్లాక్ బస్టర్ మూవీ గీతాంజలి సీక్వెల్ లో కూడా అంజలి యాక్ట్ చేస్తుంది. ఇటీవలె గీతాంజలి షూటింగ్ పూర్తయింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందు రాబోతోంది.(Anjali)

Join WhatsApp