Actress Jyothika Gave Strong Reply To Lady Fan

Jyothika: సౌత్ సినీ పరిశ్రమలో అత్యంత అందమైన, అన్యోన్య‌మైన‌ జంటల్లో సూర్య-జోతిక జోడీ ముందు వ‌రుస‌లో ఉంటుంది. 2006లో సూర్య, జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే జ్యోతిక స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతుంది. సూర్య అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. వివాహం అనంతరం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న జ్యోతిక సంపూర్ణ గృహిణిగా మారిపోయింది. ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది.

Actress Jyothika Gave Strong Reply To Lady Fan

పిల్లలు బాగోగులు, ఇంటి బాధ్యతలతో పాటు కెరీర్‌ పరంగా భర్తకు తన వంతు సహకారం అందించింది. పెళ్లి త‌ర్వాత సూర్య కెరీర్ మరింత ఊపందుకుంది. కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో కూడా స్పెషల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. మ‌రోవైపు పిల్లలు పెద్దవారు కావడంతో జ్యోతిక మ‌ళ్లీ న‌టిగా రీఎంట్రీ ఇచ్చింది. తన వయసుకు తగ్గ పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది.

రీసెంట్ గా సైతాన్ మూవీతో జ్యోతిక బాలీవుడ్ సినీ ప్రియుల‌ను ప‌ల‌క‌రించింది. అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక, మాధవన్, జానకి బోదివాలా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 150 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకుంది. ఇటీవ‌ల ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో సూర్య కూడా సంద‌డి చేశారు.(Jyothika)

Also Read: Ali: ల‌వ్ లో ఫెయిల్ అయిన క‌మెడియ‌న్ ఆలీ.. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు వ‌దిలేశాడో తెలిస్తే షాకే!

ప్ర‌స్తుతం సైతాన్ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జ్యోతిక‌.. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో సూర్య, మాధవన్, అజయ్ దేవ్‍గణ్ తో కలిసి దిగిన ఫోటోను వీడియో రూపంలో పంచుకుంది. అయితే ఈ వీడియో కింద ఓ లేడీ అభిమాని త‌న వింత కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది. జ్యోతిక మేడమ్.. సూర్య సర్ ను ఒరు కాదల్ సినిమాలో మాదిరి మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా..? 15 ఏళ్లుగా ఆయనకు నేను పెద్ద అభిమానిని అని కామెంట్ పెట్టింది. అయితే స‌ద‌రు లేడీ ఫ్యాన్ కామెంట్ కు జ్యోతిక‌ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. అలా చేయడం కుదరదంటూ తెగేసి చెప్పింది. ఇక జ్యోతిక రిప్లై ఇవ్వ‌డంతో.. స‌ద‌రు అభిమాని తెగ సంతోషించింది.

Join WhatsApp