Actress Rohini rejected the character of Jordhar Sujatha in Save the Tigers series

Save the Tigers: ఇటీవల కాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా భారీ ఆదరణ దక్కుతోంది. దీంతో అగ్ర తారలు వెబ్ సిరీస్ లు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్లు డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే రీసెంట్ టైమ్‌లో తెలుగులో మంచి కంటెంట్ తో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన వెబ్ సిరీస్ లలో సేవ్ ది టైగర్స్ ఒకటి. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని, దేవయాని ప్రధాన పాత్రను పోషించారు.

Actress Rohini rejected the character of Jordhar Sujatha in Save the Tigers series

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత ఏడాది ఫస్ట్ సీజన్ రిలీజ్ కాగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రెండో సీజన్ ను కూడా తెర‌కెక్కించి ఇటీవల రిలీజ్ చేశారు. రెండో సీజన్ కూడా నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను చక్కగా ఆకట్టుకుంటోంది. కామెడీకి ఏమాత్రం కొదవ లేకపోవడంతో సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌ భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఇక‌పోతే ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి-జోర్దార్ సుజాత జోడి బాగా హైలెట్ అయింది.

Actress Rohini rejected the character of Jordhar Sujatha in Save the Tigers series..?

గంటా రవి పాత్రలో ప్రియదర్శి నటిస్తే.. అతని భార్య హైమాగా సుజాత అదరగొట్టింది. వైఫ్ అండ్ హ‌స్బెండ్‌గా వీరిద్దరూ పండించిన కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్ ద్వారా ఈ జంటకు సపరేట్‌ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అంత‌లా ప్రియ‌ద‌ర్శి, సుజాత అల‌రించారు. అయితే వాస్తవానికి ప్రియదర్శి భార్య క్యారెక్టర్ కోసం మొదట మరొక నటిని అనుకున్నారట‌. ఆమె మరెవరో కాదు రోహిణి. సీరియ‌ల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో సహా పలు టీవీ షోస్ లో వ‌ర్క్ చేస్తోంది. అలాగే వెండితెర‌పై వరస చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే సేవ్ ది టైగర్స్ సిరీస్ లో హైమా పాత్ర కోసం మొదట రోహిణిని సంప్రదించారట.(Save the Tigers)

Also Read: Kajal Aggarwal: టాలీవుడ్ లో కాజ‌ల్ మోస్ట్ ఫేవ‌రెట్ హీరో అత‌నే.. ఎట్ట‌కేల‌కు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన చంద‌మామ‌!

కానీ టీవీ షోస్ మరియు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రోహిణి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింద. ఈ కారణంగానే హైమా క్యారెక్టర్ కు నో చెప్పింది. దాంతో రోహిణికి బదులు సుజాతను తీసుకున్నారు. ఇక కొంతకాలం తర్వాత సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్‌లోనే పనిమనిషి క్యారెక్టర్ కోసం మరోసారి రోహిణిని సంప్రదించారు. అయితే ఆ టైమ్స్ లో డేట్స్ కుదిరే వీలుండ‌టం.. పైగా పనిమనిషి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో రోహిణి ఓకే చెప్పింద‌ట‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిణి ఈ విషయాన్ని స్వయంగా బయట పెట్టింది. అలాగే హైమా క్యారెక్టర్ లో తనకంటే సుజాతే బాగా నటించిందని పేర్కొంది. ఇక సేవ్ ది టైగర్స్ లో అభినవ్ కోమఠం ఇంట్లో పనిమనిషిగా తనదైన కామెడీ టైమింగ్ తో రోహిని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. సిరీస్ లో ఆమె పాత్ర కూడా బాగా హైలెట్ అయింది.

Join WhatsApp