Actress Surbhi Escaped from Flight Accident

Surbhi: ప్రముఖ హీరోయిన్ సురభి పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చింది. పూర్తి వివరాల్లోకి.. ఢిల్లీలో జన్మించిన సురభి 2013లో ఇవాన్ వెరమత్రి అనే తమిళ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. 2015లో బీరువా మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్ మేన్, ఒక్క క్షణం, ఓటర్, శశి వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.

Actress Surbhi Escaped from Flight Accident

అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నప్పటికీ సరైన సక్సెస్ రేట్ లేకపోవడం వల్ల సురభి క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. కనీసం టైర్ 2 హీరోలు కూడా సురభిని పట్టించుకోవడం మానేశారు. దీంతో వచ్చిన అవకాశాలతోనే కెరీర్ ను నెట్టుకొస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగులో సురభికి ఒక అవకాశం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న విశ్వంభర మూవీలో ఒక క్యారెక్టర్ కోసం సుర‌భిని తీసుకున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా సుర‌భి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట‌ వైరల్ గా మారింది.

Actress Surbhi Escaped from Flight Accident

ఈ పోస్టులో చావు నుంచి జెస్ట్ మిస్ అయ్యానంటూ సుర‌భి షాకింగ్ కామెంట్స్‌ చేసింది. అసలేం జరిగిందంటే.. ఆదివారం నాడు సురభి ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపానికి గురై భారీ ప్రమాదం జ‌రిగే పరిస్థితి ఏర్పడింది. విమానాన్ని పైలెట్ కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ సమయంలో సురభి తో సహా ఫ్లైట్‌లో ఉన్న వారంతా ఫుల్లుగా భయపడిపోయారు. కానీ చివ‌రి నిమిషాల్లో పైలెట్ తెలివిగా వ్య‌వ‌హ‌రించి సేఫ్ గా విమానాన్ని ల్యాండ్ చేశాడు.(Surbhi)

Also Read: Anushka Sharma: శాశ్వ‌తంగా ముంబైని వీడ‌బోతున్న విరుష్క జంట‌.. పిల్ల‌ల‌తో ఎక్క‌డ సెట‌ల్ కాబోతున్నారంటే?

దాంతో అంద‌రూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే విషయాన్ని సుర‌భి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకుంది. ఆ ఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంద‌ని.. చావు నుంచు తృటిలో తప్పించుకొని వ‌చ్చాన‌ని సుర‌భి తెలిపింది. అలాగే ఈ ఘ‌ట‌న త‌న‌లో ఉన్న పాజిటివ్ థింకింగ్ పై త‌న‌కు మ‌రింత న‌మ్మ‌కాన్ని క‌లగ‌జేసింది సుర‌భి పోస్ట్ లో పేర్కొంది. ఏదేమైనా సుర‌భి సేఫ్ గా ఉండ‌టంతో ఆమె అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Join WhatsApp