Actress Tripti Dimri Boyfriend Sam Merchant Details Here

Tripti Dimri: త్రిప్తి డిమ్రి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లైన యానిమ‌ల్ మూవీతో త్రిప్తి నేష‌న‌ల్ వైడ్ గా కుర్రాళ్ల‌కు హాట్ ఫేవ‌రెట్ అయిపోయింది. ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్‌ చేసిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఈ చిత్రంలో మెయిన్ అయిన ర‌ష్మిక అయిన‌ప్ప‌టికీ.. సెకండాఫ్ లో జోయ పాత్ర‌లో న‌టించిన త్రిప్తికే ఎక్కువ క్రేజ్ ల‌భించింది. ఇంకా చెప్పాలంటే తెర‌పై త్రిప్తి క‌నిపించేది కొద్దిసేపే అయినా.. ర‌ష్మిక‌ను పూర్తిగా డామినేట్ చేసి ప‌డేసింది.

Actress Tripti Dimri Boyfriend Sam Merchant Details Here

యానిమ‌ల్ మూవీతో త్రిప్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇండియ‌న్ మూవీ డేటాబేస్(ఐఎండీబీ) రీసెంట్‌గా విడుద‌ల చేసిన మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ల జాబితాలో సైతం త్రిప్తి మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఆమెకు నార్త్ తో పాటు సౌత్ సినిమాల్లోనూ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం త్రిప్తికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. విష‌యం ఏంటంటే.. బ‌డా వ్యాపార‌వేత్త‌తో త్రిప్తి డిమ్రి ప్రేమాయ‌ణం న‌డుపుతోంది. అత‌ని పేరు సామ్ మ‌ర్చంట్‌.

Actress Tripti Dimri Boyfriend Sam Merchant Details Here

ఫిబ్ర‌వ‌రి 23న త్రిప్తి బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆమెకు అభిమానులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. ప్రియుడు సామ్ మ‌ర్చంట్ కూడా త్రిప్తిని విష్ చేశాడు. త్రిప్తితో తీసుకున్న సెల్ఫీని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు. హ్యాపీయెస్ట్ బర్త్‌డే డియరెస్ట్ త్రిప్తి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. వీరి సెల్ఫీ చూసిన నెటిజ‌న్లు ఆరాలు తీయ‌గా.. సామ్‌, త్రిప్తి ప్రేమ‌లో ఉన్నార‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. కానీ, ఇంత వ‌ర‌కు వారు ఈ విష‌యంపై ఓపెన్ అవ్వ‌లేదు.(Tripti Dimri)

Also Read: Rakul Preet Singh: పెళ్లి వీడియోను పంచుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వు!

సామ్ మర్చంట్ ఒక వ్యాపార‌వేత్త మ‌రియు మోడ‌ల్ కూడా. 2002లో గ్లాడ్రాగ్స్ మ్యాన్ హంట్ పోటీలో పాల్గొని టైటిల్‌ గెలిచాడు. అలాగే గోవాలో సామ్ మ‌ర్చంట్ అనేక హోటళ్లు, బీచ్ క్లబ్స్ ను న‌డుపుతున్నాడు. గోవాలోని వాటర్స్ బీచ్ లాంజ్ & గ్రిల్ ను కూడా అత‌నే స్థాపించాడు. ప్ర‌స్తుతం బిజినెస్ రంగంలో సామ్ స‌త్తా చాటుతున్నాడు. ఇక‌పోతే చాలా కాలం నుంచి సామ్ తో త్రిప్తి రిలేష‌న్ లో ఉంద‌ని అంటున్నారు. అయితే తాజాగా ఈ విష‌యం తెలుసుకున్న కుర్రాళ్లు త్రిప్తి ప్రియుడిని చూసి కుల్లుకుంటున్నారు.

Join WhatsApp