Actress Trisha Signed One More Telugu Movie

Trisha: తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన చెన్నై సోయ‌గం త్రిష కృష్ణ‌న్ ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే కాకుండా క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ త్రిష సినిమాలు చేసింది. దాదాపు ద‌శాబ్దన్న‌ర పాటు టాప్ హీరోయిన్ గా స‌త్తా చాటింది. ఆ త‌ర్వాత కాలంలో కొత్త హీరోయిన్ల పోటీ, స‌రైన హిట్లు లేక‌పోవ‌డంతో త్రిష గ్రాఫ్ కాస్త నెమ్మ‌దించింది. కానీ, పొన్నియిన్ సెల్వన్ త‌ర్వాత త్రిష మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేసింది.

Actress Trisha Signed One More Telugu Movie

కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. ఇటు టాలీవుడ్ లో సైతం త్రిష జోరు పెంచుతోంది. ఇప్ప‌టికే తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంభ‌ర సినిమాకు సైన్ చేసింది. ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లోనే షూటింగ్ ప్రారంభ‌మైంది.

దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత తెలుగులో త్రిష ఒప్పుకున్న తొలి చిత్రం విశ్వంభ‌ర‌. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే త్రిష తెలుగులో మ‌రో సీనియ‌ర్ హీరో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు విక్ట‌రీ వెంక‌టేష్‌. గ‌తంలో వెంక‌టేష్‌, త్రిష జంట‌గా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నమో వెంకటేశా, బాడీ గార్డ్ చిత్రాల్లో జంట‌గా న‌టించారు. ఈ మూడు చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి.(Trisha)

Also Read: Mahesh Babu: ఒకే స్టోరీతో వ‌చ్చి సూప‌ర్ హిట్స్ గా నిలిచిన‌ మ‌హేష్ బాబు, ర‌వితేజ సినిమాలు ఏవో తెలుసా?

అయితే ఇప్పుడు మ‌రోసారి వెంక‌టేష్‌, త్రిష జ‌త‌క‌ట్ట‌బోతున్నారు. ఇటీవ‌ల సైంధ‌వ్ మూవీతో వెంకీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. భారీ అంచ‌నాల నడుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ప్ర‌స్తుతం వెంక‌టేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో చేసేందుకు రెడీ అవుతున్నాడు. కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో వీరి కాంబోలో చిత్రం తెర‌కెక్క‌బోతోంది. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష‌ను ఎంపిక చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయ‌ని అంటున్నారు.

Join WhatsApp