Ambajipeta Marriage Band

Ambajipeta Marriage Band: వరుస వెరైటీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుహాస్ ఇప్పుడు మరో మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేషనల్ అవార్డు చిత్రమైన కలర్ ఫోటో సినిమా తర్వాత అంతటి మంచి కథ ఉన్న సినిమాగా రాబోతున్న అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Adivi Sesh For Ambajipeta Marriage Band

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. ఈ ఈవెంట్ ను ఈరోజు హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో చేస్తుండగా ఈ కార్యక్రమానికి అడివి శేష్ అతిధిగా రాబోతుండడం విశేషం.

Also Read: Tech Tips: మీ మొబైల్ నంబర్ ని మర్చిపోయారా…? అయితే ఈ ట్రిక్స్‌ తో తెలుసుకోవచ్చు..!

ఈ చిత్రం పూర్తిగా ఎమోషనల్ సీన్స్ తో కూడుకున్నదని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 2 ప్రేక్షకులను ఏ స్థాయి లో ఆకట్టుకుంటుందో చూడాలి. బేబీ సినిమా కి ఒక నిర్మాత గా వ్యవహరించిన ధీరజ్ అంతకుముందు కొన్ని మంచి సినిమాలు అందజేశారు.

 Ambajipeta Marriage Band
Join WhatsApp