After 18 years Surya- Jyotika doing that job

Surya: రియల్ లైఫ్ లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటగా పేరు సంపాదించుకున్న నటీనటులు కొందరు మాత్రమే ఉంటారు. వారిలో సూర్య మరియు జ్యోతిక కూడా ఒకరు. వీరిద్దరూ 1999లో విడుదలైన పువెల్లామ్ కేట్టుప్పార్ మూవీలో తొలిసారి కలిసి నటించారు. ఇక ఆ తరువాత ఉయిరిలే కలందదు, కాక్క కాక్క వంటి సినిమాల్లో నటించారు.

After 18 years Surya- Jyotika doing that job

కాగా అలా వీరి పరిచయం ప్రేమగా మారి 2006లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం జ్యోతిక నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇద్దరూ పిల్లలకు తల్లి అయిన ఈమె మళ్లీ 36 వయదినిలే సినిమాతో కథానాయకగా రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో మంచి మహిళ కథానాయకతో కూడిన కథ చిత్రాల్లో నటిస్తుంది.

Also Read: Health: ఉచితంగా దొరికే ఈ ఆకు తిని మీ సమస్యలన్నిటికీ చెక్ పెట్టండి..!

ఇటీవల బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి.. అక్కడ అజయ్ దేవగన్ సరసన నటించిన సైతాన్ సంచలన విజయం గా నిలిచింది. తమిళంలోనూ ముమ్మట్టికి జోడిగా కాదల్ ది కోర్ అనే చిత్రంలో నటించింది. ఇకపోతే సూర్య పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈయన నటించాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి.

After 18 years Surya- Jyotika doing that job

అలాంటిది 18 ఏళ్ల తర్వాత సూర్య మరియు జ్యోతిక మరోసారి జంటగా నటించడానికి సిద్ధం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య నటించబోయే సినిమాల్లో జ్యోతికని ఓ డైరెక్టర్ హీరోయిన్గా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటో తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వార్తను చూసిన వీరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.(Surya)

Join WhatsApp