Age Gap Between Rajamouli And His Wife Rama

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. కెరీర్ ఆరంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోతూ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.. ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ గా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించ‌బోతున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.

Age Gap Between Rajamouli And His Wife Rama

ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. రాజమౌళి పర్సనల్ లైఫ్ విశేషాలు మనందరికీ తెలిసిందే. రాజమౌళి రియల్ లైఫ్ ఒక సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. టాలీవుడ్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్న దర్శకుల్లో రాజమౌళి కూడా ఒకరు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి భార్య వల్లి చెల్లెలైన రమాను రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రమాకు ఇదే రెండో వివాహం. రాజమౌళి కంటే ముందే ఆమెకు మరొక వ్యక్తితో వివాహం జరిగింది. ఒక బాబు కూడా జన్మించాడు. అతడే కార్తికేయ.

అయితే కొడుకు పుట్టిన తర్వాత రమా తన మొదటి భర్తతో విడిపోయింది. ఆపై కొడుకుని తీసుకుని అక్క వల్లి ఇంటికి వచ్చేసింది. ఆ సమయంలోనే రమాతో రాజమౌళి ప్రేమలో పడ్డాడు. మొదట రమా రెండో పెళ్లికి అంగీకరించకపోయినా.. రాజ‌మౌళి మంచితనం, ప్రేమ‌ చూసి అతనితో ఏడడుగులు వేసింది. ఇక వివాహం అనంతరం రాజమౌళి, ర‌మా దంపతులు పిల్లలను కనలేదు. కార్తికేయను రాజమౌళి తన సొంత కుమారుడిగా అంగీకరించాడు. అలాగే మరొక అమ్మాయిని దత్తత తీసుకున్నారు.(Rajamouli)

Also Read: Jyothika: ఒక‌రోజు నీ భ‌ర్త‌ను నాకు ఇవ్వ‌మంటూ అభిమాని వింత కోరిక‌.. జ్యోతిక అదిరిపోయే రిప్లై!

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. వయసులో రాజమౌళి కంటే రమానే పెద్దవారు. రాజ‌మౌళికి 50 ఏళ్లు కాగా.. ర‌మాకు 53 ఏళ్లు. ర‌మా 1969 జూలై 15న జన్మిస్తే.. రాజమౌళి 1973 అక్టోబర్ 10 న పుట్టారు. వీరిద్దరి మధ్య మూడేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. అయితే వయసుతో సహా మరేది వారి ప్రేమకు అడ్డు రాలేదు. 2001లో రమాను రాజమౌళి పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఇక రాజమౌళి టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతుంటే.. ర‌మా కాస్ట్యూమ్‌ డిజైనర్ గా సత్తా చాటుతున్నారు. బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైనర్ గా ఎన్నో అవార్డులను అందుకున్నారు.

Join WhatsApp