Akhil Love That Heroine

Akhil: అక్కినేని అఖిల్ నిజంగానే ఆ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా …అక్కినేని ఇంటికి చిన్న కోడలు ఫిక్స్ అయిపోయిందా..అంటూ ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ నెట్టింట్లో జోరుగా కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ అక్కినేని అఖిల్ ఏ హీరోయిన్ ప్రేమలో పడ్డారో ఇప్పుడు చూద్దాం.. సిసింద్రీ సినిమాతో సంవత్సరం కాకముందే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ మనం సినిమాలో చివర్లో గెస్ట్ రోల్ చేశారు.

Akhil Love That Heroine

ఆ తర్వాత తన పేరుతోనే అఖిల్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమయ్యారు. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ మూవీ అట్టర్ ప్లాప్ అయింది.ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను వంటి వరుస సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ఆ తర్వాత పూజ హెగ్డే తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్టే కానీ అఖిల్ కి మాత్రం గుర్తింపు రాలేదు.ఇక భారీ బడ్జెట్ తో వచ్చిన పాన్ ఇండియా మూవీ ఏజెంట్ డిజాస్టర్ అవడంతో అఖిల్ సినీ కెరీర్ ఒక్కసారిగా ఇరకాటంలో పడిపోయింది.(Akhil )

Also Read: Amala: అమల చూస్తుండగానే పాడు పని చేసిన నాగార్జున.. కోపంతో ఆమె ఏం చేసిందంటే..?

ఒకవేళ నెక్స్ట్ చేసే సినిమా హిట్టు కాకపోతే అఖిల్ కి సినిమాల్లో అవకాశాలు రావు అని కొంతమంది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజాగా అఖిల్ ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ టాలీవుడ్ వర్గాల్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ సన్నిహితులే లీక్ చేయడంతో ఇది నిజమే కావచ్చని అందరూ అనుకుంటున్నారు.ఇక ఆ హీరోయిన్ ఎవరంటే అఖిల్ తో సినిమాలో నటించిన ఓ హీరోయిన్.. ఆమెతో అఖిల్ ప్రేమలో ఉన్నారట.

Akhil Love That Heroine

అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ పాటలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలా ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని, వీరిద్దరూ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని అఖిల్ తన సన్నిహితులతో చెప్పుకోవడంతో వాళ్లు ఈ విషయాన్ని మీడియాకి లీక్ చేసినట్టు సమాచారం. త్వరలోనే అక్కినేని అఖిల్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారని, అక్కినేని ఇంటికి కాబోయే చిన్న కోడలు దొరికేసింది అంటూ ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ సోషల్ మీడియా లో కామెంట్లు పెడుతున్నారు(Akhil )

Join WhatsApp