Alia Bhatt's Ayodhya Ram Mandir Saree Price

Alia Bhatt: హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరాముని ఆలయాన్ని అయోధ్యలో నిర్మించాలనేది హిందువుల కల. కానీ ఈ కల దాదాపు 500 సంవత్సరాలుగా కలగానే మిగిలిపోయింది.కానీ ఈ సంవత్సరం జనవరి 22న హిందువుల కల నెరవేరి పోయింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వేడుకకి దేశ నలుమూలల ప్రజలే కాకుండా విదేశాల నుండి కూడా చాలామంది అయోధ్య రామ దర్శనం కోసం తరలివచ్చారు. ఇక ఈ వేడుకకి చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

Alia Bhatt’s Ayodhya Ram Mandir Saree Price

ఇక వీరందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది బాలీవుడ్ నటి అలియా భట్.. అలియా భట్ సందర్భం ఏదైనా సరే సందర్భానికి తగ్గట్టుగా తన డ్రెస్సింగ్ స్టైల్ ని,హెయిర్ స్టైల్ ని కూడా మార్చుకుంటుంది. అలా అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవానికి భర్తతో కలిసి వెళ్లిన అలియా భట్ అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది.ఎందుకంటే ఆమె కట్టుకున్న సారీ అందరినీ ఆకర్షితులను చేసింది.సింపుల్ గా కనిపించే బ్లూ కలర్ సారీలో మెరిసిన అలియా భట్ ఆ సారీ పైనే రామాయణ ఇతివృత్తం మొత్తం కళ్ళకు కట్టినట్టుగా చూపించింది.

Also Read: NTR: ఆహ్వానం అందినా ఎన్టీఆర్ అయోధ్య‌కు వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఆ హీరోనేనా..?

అలియా భట్ చీర బార్డర్, కొంగు పై రామాయణం కి సంబంధించిన అక్షరాలు, చిత్రాలు క్షుణ్ణంగా చూస్తే అందరికీ కనిపిస్తాయి. అలియా భట్ ధరించిన చీర కొంగుపై హనుమాన్ బొమ్మలతో పాటు రామసేతు బ్రిడ్జి కూడా ఉందట. దాంతో చాలామంది అలియా భట్ చీరని చూసి అలాగే ఉండిపోయారట. అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన రణబీర్ కపూర్ అలియా భట్ దంపతులు అభిమానులతో సెల్ఫీలు దిగారు.

Do you know the price of the saree worn by Alia Bhatt at the Ayodhya Ram Mandir inauguration ceremony

అలియా భట్ ఇలా అయోధ్యకి చాలా సింపుల్ గా అలాగే సాంప్రదాయమైన వస్త్రాలు ధరించి రావడంతో అందరూ ఈమె వస్త్రాధరణ కి ఫిదా అయ్యారు. అంతేకాదు అలియా భట్ కట్టుకున్న ఆ స్పెషల్ సారీ ధర అక్షరాల లక్షా యాబై వేలు(1,50,000) అని తెలుస్తోంది. ఇక ఈ చీరను అలియా భట్ స్పెషల్ గా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసమే తయారు చేయించుకున్నట్లు తెలుస్తోంది. (Alia Bhatt)

Join WhatsApp