Alia Bhatt's Stellar Debut in RRR Movie

Alia Bhatt: పాన్ ఇండియా ట్రెండ్ బాహుబలి సినిమా నుంచి మొదలై ప్రస్తుతం కూడా ట్రెండింగ్ లో ఉంది. ఎన్నో అద్భుతమైన సినిమాలని ఇండస్ట్రీకి అందించిన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ కూడా తెరకెక్కింది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Alia Bhatt’s Stellar Debut in RRR Movie

తారక్ మరియు రామ్ చరణ్ ముఖ్య పాత్రల‌లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్‌ చేసిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ యాక్షన్ కి తగ్గ రియాక్షన్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇక ఈ మూవీలో ఆలియా భట్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో ఆలియా లుక్ కి ఎంతోమంది ఫిదా అయ్యారు. ఇక తాజాగా ఆలియా క్యారెక్టర్ పై ఓ వార్త వినిపిస్తుంది.

Also Read: Bobby Deol: తండ్రి కారణంగా గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ని వదిలేసుకున్న “యానిమల్” విలన్ బాబీ డియోల్..!!

ముందుగా ఈ క్యారెక్టర్ లో ఆలియాని అనుకోలేదట మేకర్స్. ఈ క్యారెక్టర్ లో మరో స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట. కానీ ఆమె నో చెప్పడంతో ఈ అవకాశం ఆలియా కి దక్కిందట. మరి ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. నిత్యామీనన్. ఈమె వరుస వెబ్ సిరీస్ లో బిజీగా ఉండడంతో ఈ క్యారెక్టర్ కి నో చెప్పిందట. ఇక దీంతో ఈ కథాంశాన్ని ఆలియా కి చెప్పారట మేకర్స్. ఇక ఈ ముద్దుగుమ్మ కి కూడా ఈ క్యారెక్టర్ ఎంతగానో నచ్చడంతో ఓకే చెప్పిందట.

Alia Bhatt's Stellar Debut in RRR Movie

ఇలా ఎంతో మంచి అవకాశాన్ని చేయిజార్చుకుంది నిత్యామీనన్. ఇక ప్రస్తుతం ఈ వార్త తెలుసుకున్న ప్రేక్షకులు..” నువ్వు 100 వెబ్ సిరీస్ లు చేసిన ఒక్కటే.. ఈ ఒక్క సినిమాలో నటించిన ఒక్కటే. గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుని చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు చాలా అన్ లక్కీ ఫెలోవి ” అంటూ మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Alia Bhatt)

Join WhatsApp