All the Heroines visiting that temple Because

Heroines: సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్నారు. అయితే అప్పటివరకు ఎంతో స్టైలిష్ గా డ్రెస్ వేసుకొని పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న హీరోయిన్స్ గుళ్ళు గోపురాలు అనే మాట వినపడగానే ఒంటినిండా దుస్తులు ధరించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోయినట్టు కనిపిస్తారు.అయితే ఇప్పటికే మన దేశంలో ఉన్న ఒక ఆలయాన్ని చాలామంది సెలబ్రిటీలు దర్శిస్తున్నారు.

All the Heroines visiting that temple Because

ఇక అంత మంది హీరోయిన్లు దేవాలయాన్ని ఎందుకు సందర్శిస్తున్నారు అనే డౌట్ చాలా మందిలో కలుగుతుంది. మరి ఇంతకీ ఆ దేవాలయం ఏంటో అనుకుంటున్నారా అది ఏదో కాదు కామాఖ్య దేవాలయం.. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవాలయానికి చాలామంది భక్తులు వెళుతూ ఉంటారు. అయితే ఈ దేవాలయాన్ని మామూలు జనాలే కాదు సెలబ్రిటీలు కూడా వెళ్లి దర్శించుకుంటున్నారు. మరి ఆ దేవాలయం అంత ఫేమస్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే కామాఖ్య దేవాలయం చాలా ఫేమసట. (Heroines)

Also Read: Aamani: ఆ తెలుగు హీరోతో ఎఫై** వల్లే ఆమని భర్త కి విడాకులు ఇచ్చిందా..?

అంతే కాదు ఇండస్ట్రీలో ఉండే చాలా మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి వంటి ఆస్ట్రాలజర్ కూడా ఈ కామాఖ్య దేవాలయం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇక ఈ కామాఖ్య దేవాలయానికి ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న తమన్నా,రకుల్ ప్రీత్ సింగ్, వంటి హీరోయిన్లతో పాటు రీసెంట్ గా సంయుక్త మీనన్ కూడా వెళ్ళింది. అయితే చాలామంది హీరోయిన్లు ఈ దేవాలయానికి రావడానికి కారణం ఏంటి అని కొంతమంది నెటిజన్స్ ఆరాతీస్తున్నారు.

All the Heroines visiting that temple Because

అయితే ఇక్కడికి వెళ్ళడానికి ప్రధాన కారణం వారి కెరియర్ మరింత మెరుగ్గా ఉండడం కోసమేనని,వారు కోరుకున్న కోరికలు తీరాలనే ఉద్దేశంతోనే ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారట. ఇక ఇంకొంతమంది హీరోయిన్స్ అందరూ పెళ్లి చేసుకునే ముందు ఇలా కామాఖ్య ఆలయాన్ని దర్శించుకుంటున్నారు కావచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లయ్యాక తన భర్తతో వచ్చి ఈ ఆలయాన్ని దర్శించింది.అలాగే తమన్నా సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. దాంతో ఈ ఇద్దరు హీరోయిన్లు పెళ్లికి ముందు ఇలా ఆలయాన్ని సందర్శించారు కావచ్చని నెటిజన్స్ భావిస్తున్నారు.(Heroines)

Join WhatsApp