Allari Naresh: My brother and I loved an one girl

Allari Naresh: అల్లరి అనే మూవీతో తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ దర్శకుడి కొడుకు అల్లరి నరేష్.. ఇక ఈయన తండ్రి ఇండస్ట్రీలో పేరున్న దర్శకుడు.. ఆయన ఎవరో కాదు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఇవివి సత్యనారాయణ.. ఇవివి సత్యనారాయణ వారసులుగా ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు ఆర్యన్ రాజేష్,అల్లరి నరేష్..ఇక ఆర్యన్ రాజేష్ కొద్ది సినిమాలకే పరిమితమై ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.

Allari Naresh: My brother and I loved an one girl

ఇక రీసెంట్గా రాంచరణ్ వినయ విధేయ రామ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. కానీ ఈయనకు ఈ సినిమా రీ ఎంట్రీ కి అంతగా ఉపయోగపడలేదని చెప్పుకోవచ్చు. ఇక అల్లరి నరేష్ ఎన్నో కామెడీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా పేరు సంపాదించారు. ఇక ఈయన తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సైతం సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈయన ఆ తర్వాత కామెడీ కాకుండా వేరే జానర్ లో సినిమాలు తీస్తూ హిట్టు కొట్టాలని చూస్తున్నారు.(Allari Naresh)

Also Read: Sada: ఆగస్టులో సదా పెళ్లి అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఇదేనా..?

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆ ఒక్కటి అడక్కు అనే మూవీ తో అల్లరి నరేష్ మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో అన్నయ్య నేను ఒకే అమ్మాయిని ప్రేమించాం.అందుకే అలా జరిగింది అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. ఇక అసలు విషయం ఏమిటంటే..ఆర్యన్ రాజేష్,అల్లరి నరేష్ ఇద్దరు ఓకే అమ్మాయిని ప్రేమించారు అంటే అది నిజ జీవితంలో కాదు.ఓ సినిమాలో.. అల్లరి నరేష్ ఆర్యన్ రాజేష్ ఇద్దరు కలిసి నువ్వంటే నాకిష్టం అనే మూవీలో నటించారు.

Allari Naresh: My brother and I loved an one girl

ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అయితే ఈ సినిమాలో రియల్ బ్రదర్స్ కాకపోయినప్పటికీ బయట మాత్రం వీళ్లు రియల్ బ్రదర్స్ కావడంతో ఈ సినిమా చూసిన చాలామంది జనాలు ఒక్క అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు ప్రేమించడం ఏంటి అని తిట్టారట.ఈ కారణంతోనే హిట్ అవ్వాల్సిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది అని అల్లరి నరేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే ఈ ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మళ్ళీ అన్నయ్యతో కలిసి ఏదైనా సినిమా చేస్తారా అంటే అన్నయ్య సెంటిమెంట్ తో వచ్చే సినిమా అయితే చేస్తాను అని అల్లరి నరేష్ చెప్పారు.(Allari Naresh)

Join WhatsApp