Allu Arjun is going to start a new business in Vizag

Allu Arjun : అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ తండ్రి బాటలో నిర్మాణ రంగాన్ని ఎంచుకోకుండా హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నారు.. ప్రస్తుతం సౌత్ లో ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే మన తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల ద్వారానే పాన్ ఇండియా హీరోలయ్యారు. అలా రామ్ చరణ్,ఎన్టీఆర్, ప్రభాస్ లు ఉన్నారు.

Allu Arjun is going to start a new business in Vizag

కానీ అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయకుండానే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ లు కూడా చాలానే చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఇప్పటికే చాలా బిజినెస్లు ఉన్నాయి. రీసెంట్ గా ఏషియన్ వారితో కలిసి AMB మాల్ కి దీటుగా AAA సినిమాస్ ని కూడా స్టార్ట్ చేశారు.(Allu Arjun )

Also Read: Silk Smitha: ఆ త‌ప్పు వ‌ల్లే సిల్క్ స్మిత బ‌లైపోయింది.. జ‌య‌మాలిని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఈ మల్టీప్లెక్స్ లు చాలా లగ్జరీగా ఉండడమే కాకుండా అన్ని చాలా క్వాలిటీ గా ఉంటాయి. అలాగే ఈ మల్టీప్లెక్స్ మొత్తం అల్లు అర్జున్ ఫోటోలతో నిండి ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా వైజాగ్ లో అల్లు అర్జున్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. అదేంటంటే అల్లు అర్జున్ ఈ మధ్యన వైజాగ్ వెళ్లిన సమయంలో ఆయన కు ఎంతమంది అభిమానులు స్వాగతం పలికారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Allu Arjun is going to start a new business in Vizag

అయితే హైదరాబాదులో మాత్రమే కాకుండా వైజాగ్ లో కూడా సినిమా బిజినెస్ బాగానే జరుగుతుంది.అందుకే అల్లు అర్జున్ ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ ని ఓపెన్ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనేవైజాగ్ లో AAA సినిమాస్ ని ఓపెన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.. వైజాగ్ లో కూడా ఇనార్బిట్ మాల్ రాబోతుంది. ఇక ఈ ఇనార్బిట్ మాల్ లో ఏషియన్ వారితో కలిసి AAA సినిమాస్ ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.(Allu Arjun )

Join WhatsApp