Sizzling Item Song in Pushpa 2 Sparks Excitement

Pushpa 2: అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పుష్ప 2. ఆగస్ట్ 15 న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ పనులను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకున్నాడు సుకుమార్.

Allu Arjun Serious Instructions to Sukumar on Pushpa 2

అయితే షూటింగ్ అయినా త్వరగా చేసి అభిమానుల కోసం ఈ సినిమా ను త్వరగా తీసుకువస్తాడా అని ఎదురుచూడగా ఈ సినిమా నత్త నడకగా షూటింగ్ సాగడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయ్యింది. ఇన్ సైడ్ వార్తల ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ 15 న కూడా రాదని చెప్తున్నారు. అయితే దీనిపై అల్లు అర్జున్ సీరియస్ గా ఉన్నారట. ఏ చిన్న లోపమైనా షూటింగ్ ను మధ్యలోనే ఆపడం, ప్యాక్ అప్ చెప్పేసి వెళ్ళిపోవడం చేయడంతోనే ఇలా జరిగిందని అల్లు అర్జున్ టీం పై సీరియస్ అయ్యారట.

Also Read: IND vs ENG: కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మ తొలగింపు ?

అంతే కాదు సుకుమార్ కి నేరుగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారట. ఎట్టి పరిస్థితులలో ఈ సినిమా ను ఆగస్ట్ 15 న విడుదల చేయాలని చెప్పారట. గతంలో పుష్ప సినిమా సమయంలోనూ ఇదే హడావుడి కనపరిచింది చిత్ర బృందం. లాస్ట్ మినట్ లో సినిమా ను పూర్తి చేసింది. అయితే లక్కీ గా అది వర్కౌట్ అయ్యింది.( Pushpa 2)

Allu Arjun’s Pushpa 2 Remuneration, A New Record?

అయితే అన్ని సమయాల్లో వర్కౌట్ అవుతుందని చెప్పలేము. సినిమా చేస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ పుష్ప 1 ను పూర్తి చేసినప్పటికీ రెండో భాగం విషయంలో ఎందుకో త్వరగా పనులు చేయలేకపోతున్నారు. మరి అల్లు అర్జున్ సూచించినట్లు ఈ సినిమా ను ఆగస్ట్ 15 న విడుదల చేస్తారో చూడాలి. రష్మిక కథానాయిక నటిస్తున్న ఈ సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Join WhatsApp