Allu Arjun who cheated Sukumar badly in that matter

Allu Arjun: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో మరియు హీరోయిన్ కాంబినేషన్ కి ఫ్యాన్స్ ఉండడం కామన్. కానీ ఓ డైరెక్టర్ అంటే స్టార్ హీరో కాంబినేషన్ కి పాపులారిటీ ఉన్న కాంబినేషన్ చాలా తక్కువ ఉంటాయి. అటువంటి వాటిలో సుకుమార్ మరియు అల్లు అర్జున్ ది కూడా ఒకటి. వీరిద్దరిది ఈనాటి స్నేహం కాదు. అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని కూడా అందిస్తున్నారు. డైరెక్షన్లో ఆరితేరిన సుకుమార్ ఒకపక్క నటనలో జీవించే అల్లు అర్జున్ మరోపక్క.

Allu Arjun who cheated Sukumar badly in that matter

వీరిద్దరూ కలిసి సినిమా తీస్తే అది పక్కా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నారు మరి వీరిద్దరూ. ఇక వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా వచ్చిన పుష్ప మూవీ ఏ రేంజ్ సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తో అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ డేస్ కూడా ఏర్పడింది. ఇక ఈ తరుణంలోనే ఈ సినిమాకి సీక్వెల్ ని రూపొందించారు. పుష్ప ది రూల్ అనే పేరుతో ఈ సీక్వెల్లి రిలీజ్ చెయ్యనున్నారు. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Also Read: Dhanush: ఆ ఒకే ఒక్క సీన్ కోసం ఏకంగా అంత కష్టపడ్డ ధనుష్.. హ్యాట్సాఫ్ అంటున్న ఫ్యాన్స్..!

ఇక ఇదిలా ఉంటే గతంలో ఓ డైరెక్టర్ మరియు పలు హీరోలు మాట్లాడిన వాటిని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సుకుమార్ మరియు అల్లు అర్జున్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ” ఆర్య సినిమాలో ఒక బుక్ రోల్ ఉంటుంది. ఒక వేలుపై బుక్ తిప్పుకుంటూ రావాలి. నేను ఒక రోజంతా బన్నీతో దానిని ప్రాక్టీస్ చేపించాను. మార్నింగ్ ఆ బుక్ లో వచ్చేసిందా అని అడిగాను. చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. వచ్చేసింది అన్నాడు. సరే చూపించు అనగానే జస్ట్ అలా పెట్టుకుని పడేశాడు.

Allu Arjun who cheated Sukumar badly in that matter

ఇక తరువాత ఒక వేరు పై నీట్ గా రోల్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఏకంగా అది ఎంత సేపు ఉందంటే రెండు నిమిషాలకి పైగానే ఉంది. అలా ఒక త్రీ మినిట్స్ పాటు అలా రోల్ చేస్తూనే వచ్చాడు. ఎక్కడ పడడం లేదు. దాంతో నేను హ్యాపీగా క్లాప్స్ కొట్టాను. నాకు తర్వాత అంతసేపు ఎలా ఉంది అని డౌట్ వచ్చింది. అప్పుడు చూస్తే ఆ బుక్ కింద చిన్న హోల్ పెట్టి.. దానికి ఒక రింగ్ పెట్టి.. మోటర్ తిరిగే మిషన్స్ ఉంటాయి కదా? అది దానికి ఫిక్స్ చేసి దాంట్లో వేలు పెట్టి తిప్పుకుంటూ వచ్చాడు. అలా ఒకసారి తిప్పితే అది తిరుగుతూనే ఉంటుంది విష్ణు చక్రం లాగా ” అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్. అలా ఆ విషయంలో అల్లు అర్జున్ సుకుమార్ ని ఘోరంగా మోసం చేశాడనే చెప్పుకోవచ్చు.(Allu Arjun)

Join WhatsApp