Allu Arjun's Viral Video

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా గొప్ప పేరు సంపాదించుకున్న బన్నీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలని చేసిన ఈయన ఇటీవలే ” పుష్ప ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు.

Allu Arjun’s Viral Video

అదేవిధంగా ఈ సినిమాతోనే బన్నీ పాన్ ఇండియా హీరో అయ్యాడని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం బన్నీ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అల్లు అర్జున్ ఇటు సినిమాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో..మరోపక్క ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. ఈయన భార్య స్నేహారెడ్డి సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

Also Read: Parliament: పార్లమెంట్ లోకి ఎవరు వెళ్లాలన్నా.. ఇప్పుడు స్కాన్ చెయ్యాలి..!

అలానే బన్నీ కొడుకు అయాన్, కూతురు అర్హ మనందరికీ సుపరిచితమే. వీరిద్దరూ కూడా వీరి చిలిపి చేష్టలతో ఫ్యాన్స్ ని నవ్విస్తూ ఉంటారు. ఇక తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. అల్లు అర్జున్ బయటకి వస్తు వెనక్కి తిరిగి తన భార్య స్నేహారెడ్డి తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇదే తరుణంలో బన్నీతో వచ్చిన అయాన్ అక్కడి నుంచి ముందుకి వెళ్ళిపోతాడు.

ఇక అది తెలియని బన్నీ తన కొడుకు భుజంపై చెయ్యి వెయ్యడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఎంతసేపటికి తన చెయ్యి కొడుకు మీద పడకపోవడంతో వెనక్కి తిరిగి చూసేదప్పటికి అయాన్ ఉండడు. ఇక ఈ విషయంలో బన్నీని.. అయాన్ పెద్ద ఎర్రి పప్పని చేశాడనే చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (Allu Arjun)

Join WhatsApp