Amitabh Bachchan bought a place in Mumbai

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ లో చాలా సంవత్సరాలు స్టార్ హీరోగా కొనసాగిన ఈ హీరో కి వయసు మీద పడ్డా కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.ఇక వయసు పెరిగిపోతుండడం తో ఆయన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ సౌత్ లో కూడా రాణిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి 2898 AD మూవీలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా అమితాబ్ బచ్చన్ లుక్ కూడా రివిల్ చేశారు చిత్ర యూనిట్.

Amitabh Bachchan bought a place in Mumbai

ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్ రీసెంట్ గానే అయోధ్యలో ఖరీదైన స్థలం కొన్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఆ స్థలం కొన్న కొన్ని రోజులకే మళ్ళీ ముంబైలో కోట్లు ఖర్చుపెట్టి దాదాపు 20 ఎకరాల పొలం కొన్నారట. మరి ఇంతకీ దాని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందామా.. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత ఉన్నట్టుండి ఆయన సంపాదించిన ఆస్తులపాస్తులన్నీ తరిగిపోవడంతో దీనస్థితికి వచ్చారు.(Amitabh Bachchan)

Also Read: Sreeleela: రాజకీయ నాయకుడి మనవడితో శ్రీలీల డేటిం**.. త్వరలోనే పెళ్లి..?

మళ్లీ కౌన్ బనేగా కరోడ్ పతి అనే షో కి హోస్టుగా చేసి తిరిగి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు.ఆ తర్వాత ఈయన ఎన్నో డబ్బులు కూడబెట్టారు.ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న రిచ్చెస్ట్ హీరోలలో ఈయన కూడా ఒకరు. అమితాబ్ బచ్చన్ గురించి ఓ వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఆయన ముంబై శివారు లో ఉన్న అలీబాగ్ అనే ప్రాంతంలో దాదాపు 20 ఎకరాల పొలం కొన్నట్టు తెలుస్తోంది.ఇక 20 ఎకరాల పొలం అంటే దాని ధర ఏ రేంజ్ లో ఉంటుంది అర్థం చేసుకోవచ్చు.

Amitabh Bachchan bought a place in Mumbai

ఇక బీటౌన్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆ పొలాన్ని దాదాపు 10 కోట్లకు పైగా ఖర్చు చేసి అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా అయోధ్యలో స్థలం కొన్న సమయంలో ఎవరి దగ్గర్నుండయితే ఆ స్థలాన్ని కొనుగోలు చేశారో మళ్లీ వారి దగ్గరే ముంబైలోని ఈ స్థలాన్ని కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక అమితాబచ్చన్ ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన హౌస్ ఆఫ్ అభినందన్ లోధా అనే సంస్థ దగ్గర కొన్నారట..(Amitabh Bachchan)

Join WhatsApp