Amithab Bacchan who was admitted to the hospital

Amithab Bacchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హాస్పిటల్లో చేరినట్టు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ తీవ్ర అస్వస్తతో హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్ ఈ రోజు ఉదయం హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది. అయితే వయసు మీద పడడంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం.

Amithab Bacchan who was admitted to the hospital

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అమితాబ్ బచ్చన్ ఈరోజు ఉదయం ముంబైలోని కోకిల బెన్ అనే హాస్పిటల్ చేరినట్టు తెలుస్తోంది. దాంతో ఆయన అభిమానులందరూ ఆందోళన పడుతున్నారు. అసలు మా హీరోకి ఏమైంది.. ఎందుకు ఆయన హాస్పిటల్లో చేరారు అంటూ భయాందోళనలో మునిగిపోయారు.అయితే కొంతమందేమో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు మాట్లాడుకుంటుంటే.. (Amithab Bacchan )

Also Read: Alia Bhatt: భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న అలియా భట్.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..?

మరికొంత మందేమో ఆయన కాలుకు సర్జరీ చేయించుకోవడం కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని మాట్లాడుకుంటున్నారు.అయితే ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్ ఆరోగ్య విషయంపై ఫ్యామిలీ గానీ..డాక్టర్లు గానీ.. అధికారికంగా ఎలాంటి వార్తలు బయట పెట్టలేదు. అయితే ఈరోజు ఉదయం నుండి ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో నిజంగానే అమితాబ్ బచ్చన్ కి ఏమో అయిందని అభిమానులు ఆందోళన పడుతున్నారు.

Amithab Bacchan who was admitted to the hospital

అంతేకాకుండా ఈరోజు ఉదయమే అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా ఖాతా అయిన (ట్విట్టర్) ఎక్స్ ఖాతా లో “ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను” అంటూ ఒక పోస్ట్ పెట్టారు. దాంతో ఆయన అనారోగ్య కారణాల వల్లే ఇలాంటి పోస్ట్ పెట్టారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగానే అమితాబ్ బచ్చన్ హాస్పిటల్ లో చేరారా అనేది తెలియాలంటే ఫ్యామిలీ ఈ వార్తపై క్లారిటీ ఇవ్వాల్సిందే.(Amithab Bacchan )

Join WhatsApp