Amy Jackson Gets Engaged With Hollywood Actor Ed Westwick

Amy Jackson: బ్రిటన్ బ్యూటీ అమీ జాక్స‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ద్రాస‌ప‌ట్ట‌ణం అనే త‌మిళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమీ జాక్స‌న్‌.. ఐ మూవీతో ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైంది. తెలుగులో ఎవ‌డు, అభినేత్రి వంటి చిత్రాల్లో అల‌రించింది. అలాగే త‌మిళంలో తాండవం, తంగ మగన్, గేతు, తేరి, ఐ, రోబో 2 త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. ధ‌నుష్‌, విక్ర‌మ్, ద‌ళ‌ప‌తి విజ‌య్ వంటి అగ్ర హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Amy Jackson Gets Engaged With Hollywood Actor Ed Westwick

క‌న్న‌డ‌, హిందీ చిత్రాల్లోనూ న‌టించింది. కానీ, స్టార్ హీరోయిన్ గా మాత్రం ముద్ర వేయించుకోలేక‌పోయింది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. అమీ జాక్స‌న్ సినిమాల ద్వారా క‌న్నా ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్స్ ద్వారానే ఎక్కువ‌గా పాపుల‌ర్ అయింది అన‌డంలో సందేహం లేదు. 2015 నుండి ఇంగ్లీష్-సైప్రియట్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనయోటౌ కుమారుడు జార్జ్ పనయోటౌతో అమీ జాక్స‌న్ డేటింగ్ చేసింది. దాదాపు నాలుగేళ్ల పాటు వీరి బంధం కొన‌సాగింది.

ఈ జంట‌కు 2019 జ‌న‌వ‌రి 1న ఒక బాబు కూడా జ‌న్మించాడు. పెళ్లి కాకుండానే అమీ జాక్స‌న్ త‌ల్లి కావ‌డం అప్ప‌ట్లో ఓ సెన్సేష‌న్‌. పోని బిడ్డ పుట్టాక అయినా జార్జ్ ను వివాహం చేసుకుందా అంటే.. అదీ లేదు. జార్జ్‌, అమీ జాక్స‌న్ బ్రేక‌ప్ చెప్పుకుని విడిపోయారు. అప్ప‌టి నుంచి కుమారుడితో ఒంట‌రిగానే ఉంటున్న అమీ జాక్స‌న్ 2022లో మ‌ళ్లీ ప్రేమలో ప‌డింది. ఎడ్ వెస్ట్‌విక్ అనే హాలీవుడ్ న‌టుడు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో ఫ్రెష్‌గా రిలేష‌న్ స్టార్ట్ చేసింది.(Amy Jackson)

Also Read: Sharwanand: శర్వానంద్ మాజీ లవర్ ని పెళ్లాడబోతున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు..!!

అయితే తాజాగా ఈ జంట సినిమా స్టైల్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అమీ జాక్స‌న్ మ‌రియు ఎడ్ వెస్ట్‌విక్ ఇప్పుడు స్విట్జ‌ర్లాండ్ టూర్‌లో ఉన్నారు. అక్కడ మంచు కొండ‌ల్లోని ఓ బ్రిడ్జ్‌పై కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అమీ జాక్స‌న్‌కు ఎడ్ వెస్ట్‌విక్ మోకాళ్ల‌పై కూర్చుని ఎంతో అద్భుతంగా ప్ర‌పోజ్ చేశారు. ఆపై ఆమెకు రింగ్ తొడిగాడు. త‌మ ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫోటోల‌ను ఈ జంట సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక అతి త్వ‌ర‌లోనే ప్రియుడితో అమీ జాక్స‌న్ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. ఈ నేప‌థ్యంలోనే అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Join WhatsApp