Ananya Nagalla Reveals The Qualities Of Her Future Husband

Ananya Nagalla: టాలీవుడ్ లో ఉన్న తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకటి. టాప్ హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని అందం, అంతకుమించిన న‌ట‌నా ప్ర‌తిభ ఉన్నప్పటికీ.. అనన్యకు ఇంత వరకు సరైన హిట్ మాత్రం పడలేదు. రీసెంట్ గా ఈ బ్యూటీ తంత్ర అనే హారర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను పలకరించింది. శ్రీనివాస్ గోపిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ధ‌నుష్ ర‌ఘుముద్రి, అన‌న్య నాగ‌ళ్ల‌, స‌లోని ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. రేష్ బాబు, రవి చైతన్య ఈ మూవీకి నిర్మాత‌లు.

Ananya Nagalla Reveals The Qualities Of Her Future Husband

క్షుద్ర పూజ‌లు, క్షుద్ర దేవ‌త‌లు కాన్సెప్ట్ తో వ‌చ్చిన తంత్ర మూవీకి జెస్ట్ ఓకే టాక్ ల‌భించింది. హార‌ర్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే వారిని ఓ మోస్త‌రుగా తంత్ర ఆక‌ట్టుకుంటుంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే తన అందంతో, యాక్టింగ్ తో అనన్య నాగళ్ల ప్రేక్ష‌కుల‌ను బాగాను మెప్పించింది. క్లైమాక్స్ వచ్చే సన్నివేశాల్లో అదరగొట్టింది. ఇదిలా ఉంటే.. తంత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అన‌న్య నాగ‌ళ్ల తాజాగా ఓ టాక్ షోలో పాల్గొంది.

రీతూ చౌదరి ఈ షోను హోస్ట్ చేస్తోంది. అయితే ఈ టాక్ షోలో అన‌న్య త‌నకు ఎలాంటి వ్య‌క్తి భ‌ర్త‌గా కావాలో వివ‌రించింది. గ‌డ్డం ఉన్న అబ్బాయిలు చాలా బాగుంటార‌ని.. త‌న‌కు కాబోయే భ‌ర్త‌కు క‌చ్చితంగా గ‌డ్డం ఉండాల‌ని అన‌న్య తెలిపింది. అలాగే క‌ల‌ర్‌, హైట్, మ‌నీ లాంటి విషయాలను పెద్ద‌గా ప‌ట్టించుకోను.. చూడగానే తనను ఇంప్రెస్ చేయగలిగితే చాలని.. అలాంటి వ్య‌క్తే నాకు భ‌ర్త‌గా కావాల‌ని అన‌న్య నాగ‌ళ్ల తెలిపింది. దీంతో ఈ బ్యూటీ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.(Ananya Nagalla)

Also Read: Ileana D’Cruz: భ‌ర్త గురించి ఫ‌స్ట్ టైమ్ నోరు విప్పిన ఇలియానా.. ఏమ‌న్నా అంటే త‌ట్టుకోలేనంటూ కామెంట్స్‌!

కాగా, అన‌న్య నాగ‌ళ్ల ప్ర‌స్తుతం సాహిత్ మోత్కూరి ద‌ర్శ‌క‌త్వంలో పొట్టేల్ అనే చిత్రంలో న‌టించింది. యువ చంద్రకృష్ణ ఇందులో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. పూర్తి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్ఐఎస్ఏ ఎంటర్‌టైనర్‌మెంట్, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్ల‌పై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. అలాగే మ‌రోవైపు ప్ర‌ముఖ స్టార్ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ కు జోడీగా శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ అనే సినిమాలో అన‌న్య న‌టిస్తోంది. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌.

Join WhatsApp