Ananya Panday Stunning Embroidered Saree Price Details Here

Ananya Panday: ప్ర‌ముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 21న దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భ‌గ్నానీతో ర‌కుల్ ఏడ‌డుగులు వేసింది. ఇరువురి కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ర‌కుల్‌, జాకీ పెళ్లి చేసుకున్నారు. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో అంగ‌రంగ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది.

Ananya Panday Stunning Embroidered Saree Price Details Here

బాలీవుడ్ స్టార్స్‌ అక్ష‌య్ కుమార్‌, టైగర్ ష్రాఫ్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, రితీష్ దేశ్‌ముఖ్, వరుణ్ ధావన్, నటాషా దలాల్‌, భూమి పెడ్నేకర్ త‌దిత‌రులు ర‌కుల్‌-జాకీ వివాహ వేడుక‌లో సంద‌డి చేశారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ అన‌న్య పాండే కూడా ర‌కుల్ పెళ్లికి హాజ‌రు అయింది. ఆరు గజాల చీరలో అందంగా మెరిసిపోతూ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు ర‌కుల్ పెళ్లిలో అన‌న్య పాండే క‌ట్టుకున్న గోల్డెన్ చీర ధ‌ర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. న్యూడ్ షిమ్మర్ చీరను ధరించి యువ‌రాణిలా అన‌న్య అంద‌రినీ ఆక‌ట్టుకుంది. గోల్డెన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఆమె చీర లుక్ ను మ‌రింత పెంచేసింది. సీక్విన్ డీటెల్స్‌తో ఆమె చీర‌కున్న బార్డ‌ర్ ను గ్రాండ్ గా తీర్చిదిద్దారు. ఈ చీర‌ను అన‌న్య పాండే గోల్డెన్ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేసింది.(Ananya Panday)

Also Read: Trisha: టాలీవుడ్ లో జోరు పెంచుతున్న త్రిష.. మ‌రో సీనియ‌ర్ హీరోకు గ్రీన్ సిగ్న‌ల్‌!?

దీంతో ర‌కుల్-జాకీ పెళ్లిలో అంద‌రి దృష్టి అన‌న్య పాండేపైనే ప‌డింది. ఇక‌పోతే అన‌న్య పాండే క‌ట్టుకున్న ఆ గోల్డెన్ చీర‌ను ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేశారు. చీర ధ‌రెంతో తెలిస్తే సామాన్యుల‌కు మ‌తిపోతుంది. ఎందుకంటే, అన‌న్య పాండే చీర ఖ‌రీదు అక్ష‌రాల రూ. 1.70 లక్షలు. కాగా, కెరీర్ విష‌యానికి వ‌స్తే.. నటుడు చంకీ పాండే మరియు కాస్ట్యూమ్ డిజైనర్ భావన పాండే దంప‌తుల కుమార్తెగా 2019లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అన‌న్య పాండే.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత నార్త్‌లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసిన అన‌న్య‌.. లైగ‌ర్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. కానీ ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సి శంకరన్ నాయర్, కంట్రోల్ అనే రెండు బాలీవుడ్ చిత్రాల్లో అన‌న్య పాండే న‌టిస్తోంది.

Join WhatsApp