Animal beauty Tripti Dimri gave full clarity on marriage

Tripti Dimri: త్రిప్తి దిమ్రీ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ భారీ పాపులారిటీని దక్కించుకుంది. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ” యానిమల్ ” మూవీలో ఓ సైడ్ క్యారెక్టర్ ని పోషించి మంచి పాపులారిటీని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక యానిమల్ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి నేటి వరకు ఈమెపై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

Animal beauty Tripti Dimri gave full clarity on marriage

ఇక సోషల్ మీడియా మధ్యమాలలో ఈమె భారీగా ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు. నిజానికి ఈ సినిమాలో నటించిన రష్మిక కన్నా ఈ ముద్దుగుమ్మకే ఎక్కువ పాపులారిటీ దక్కింది. వీరి టీమ్ అంతా ఏ ఫంక్షన్ కి హాజరైన ప్రతి ఒక్క కెమెరా ఈమె పైనే ఉంటుంది. ఇక గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక త్రిప్తి తాజాగా తన పెళ్లిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read: RBI: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై RBI ఆంక్షలు…!

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మని పెళ్లి గురించి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారని అక్కడ యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఈమె బదులిస్తూ..” నా పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్ట. రానున్న రోజుల్లో ఆలోచిస్తా ” అని చెప్పుకొచ్చింది త్రిప్తి. ఇక అక్కడ ఉన్న యాంకర్ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అని ప్రశ్నించగా..” మంచి వ్యక్తి అయితే చాలు. నేను ఎప్పుడూ అదే కోరుకుంటాను. ఆస్తులు అంతస్తులు ఉన్నంత మాత్రాన మంచి మనసు ఉండదు. డబ్బు వేరు మనసు వేరు.

Animal beauty Tripti gave full clarity on marriage

గొప్ప మనసు ఉంటే డబ్బు మరియు పేరు వాటంతటికి అవే వస్తాయి. నేనెప్పుడూ ఇదే కోరుకుంటాను కూడా ” అంటూ సమాధానమిచ్చింది త్రిప్తి దిమ్రీ. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” నిజంగా అమ్మాయిలు అందరూ నీలా ఉంటే అబ్బాయిలందరికీ ఎప్పుడో మ్యారేజెస్ జరిగిపోయేవి. ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ వస్తే చాలు స్టార్ హీరోలపై కన్నేస్తున్నారు. ఈ కాలంలో కూడా నువ్వు ఎలా ఉండడం చాలా గ్రేట్ ” అంటూ ఈ ముద్దుగుమ్మని తెగ పొగడేస్తున్నారు ప్రేక్షకులు.(Tripti dimri)

Join WhatsApp