Animal Movie Villain Bobby Deol's Wife Background

Bobby Deol: అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై అంతే భారీ హిట్ అయింది. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, త్రిప్తి డిమ్రీ, అనిల్ కపూర్, బాబి డియోల్ వంటి వాళ్లు చేసిన ఈ సినిమా 2023 డిసెంబర్ 1 న విడుదలై బ్లాక్బస్టర్ హిట్ అయింది. హీరోగా రణబీర్ కపూర్ ఫేమస్ అయితే ఈ మూవీలో విలన్ గా చేసిన బాబి డియోల్ కూడా అంతే ఫేమస్ అయ్యారు.

Animal Movie Villain Bobby Deol’s Wife Background

యానిమల్ మూవీలో జమల్ కుడు అనే పాటలో బాబి డియో నెత్తిపై మందు గ్లాసు పెట్టుకొని చేసిన డ్యాన్స్, ఆ పాట ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మార్గుతోంది.. అయితే బాబి డియోల్ కి ఈ సినిమా వల్ల ముందు ఉన్న దానికంటే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే బాబీ డియోల్ భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ తాజాగా నెట్టింట్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అంతే కాదు బాబి డియోల్ కంటే బాబి డియోల్ భార్య బ్యాగ్రౌండే పెద్దదని సమాచారం. (Bobby Deol)

Also Read: Trivikram Srinivas: ఆ ముగ్గురు హీరోల‌పై క‌న్నేసిన త్రివిక్ర‌మ్‌.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌ ఎవ‌రితో..?

ఇక విషయంలోకి వెళ్తే..బాబి డియోల్ భార్య పేరు తాన్య.వీరిద్దరూ ఒక పార్టీలో కలుసుకున్నారట.ఆ పార్టీలో తాన్య తో కార్డ్స్ ఆట ఆడి బాబి ఓడిపోయారట. ఆ తర్వాత వీరిద్దరూ డిన్నర్ కి వెళ్ళిన సమయంలో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నారట. ఇక పెళ్లైన సమయంలో తాన్యాకి తన తండ్రి 300 కోట్ల ఆస్తిని రాసిచ్చారని తెలుస్తోంది.

Animal Movie Villain Bobby Deol's Wife Background

తాన్య ఆస్తి 300 కోట్లు అయితే బాబి డియోల్ ఆస్తి కేవలం 66కోట్లేనట. ఇక తాన్య ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేంద్ర ఆహుజా ముద్దుల కూతురు.ఇక తాన్య కూడా పారిశ్రామికవేత్తగా ఎంతో గుర్తింపు సంపాదించింది. ఈమె ఓన్ గా ఫర్నిషింగ్ స్టోర్ ని కూడా పెట్టుకుంది. అలాగే ఈమె ఇంటీరియర్ డిజైనర్ కూడా.. ఇక బాబి డియోల్ తాన్య ఇద్దరూ ప్రేమించి ఇంట్లో వారిని ఒప్పించి 1996లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. (Bobby Deol)

Join WhatsApp