Animal Park: Sandeep Reddy Vanga Next Big Hit in the Making

Animal Park: అర్జున్ రెడ్డి తో సెన్సేషనల్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా తన రెండో సినిమా తో కూడా అదే ప్రభంజనాన్ని సృష్టించాడు. రణబీర్ కపూర్ హీరో గా యానిమల్ అనే సినిమా ను చేసి దేశం మొత్తం తనవైపు చేసుకునేలా చేసుకున్నాడు. ఈ సినిమా పై ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా అవన్నీ సినిమా హిట్ టాక్ లో కనపడకుండా పోయాయి. ఇటీవలే ఓటీటీ లో వచ్చిన ఈ సినిమా కి అదే రీతిలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

Animal Park: Sandeep Reddy Vanga Next Big Hit in the Making

ఇక అందరు ఈ సినిమా రెండో పార్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఎండింగ్ లో యానిమల్ పార్క్ ఉంటుంది అని రెండో భాగాన్ని అనౌన్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా అందరూ ఇప్పటినుంచే ఆ సినిమా కోసం ఎదురుచూసేలా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ పార్ట్ 2 రావడానికి చాలానే సమయం పడుతుందట. ఎందుకంటే డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్ తో, అల్లు అర్జున్ తో, మహేష్ బాబు తో సినిమాలు చేయాలి.

Also Read: Husqvarna Svartpilen 401: హస్క్ వర్ణ న్యూ బైక్ లాంచ్..ఫీచర్స్ అమోఘం.!

అవి భారీ సినిమాలే. కాబట్టి ఈ సినిమాలకు కనీసం మూడేళ్లు పడుతుంది. ఇటు హీరో రణబీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర రెండు, మూడు పార్ట్ ల సినిమాలు చేయాల్సి ఉంది. ఇది గ్రాఫిక్ ఓరియెంటెడ్ సినిమాలు కాబట్టి రణబీర్ కూడా ఎక్కువ టైం పడుతుంది. ఆ గ్యాప్ లో ఈ మూడు సినిమాలు చేయాలనేది సందీప్ రెడ్డి ఆలోచన. అయితే ఈ సందర్భంలో యానిమల్ పార్క్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది.(Animal Park)

యానిమల్ పార్క్ సినిమా యానిమల్ కంటే క్రేజీ ఉంటుందని హీరో చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ మారింది. యానిమల్ లోని విధ్వంసానికి ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు యానిమల్ పార్క్ వేరే క్రేజ్ లో ఉంటుంది అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఇప్పటినుంచే ప్రేక్షకులు ఆలోచనలు చేస్తున్నారు. మరి సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ను ఎలా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడో మరీ.

Join WhatsApp