Animal Villain Bobby Deol Love Story

Bobby Deol: బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీలో ఈయన పేరు వినిపించలేదు.కానీ ఎప్పుడైతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీలో విలన్ గా చేశారో అప్పటినుండి బాబీ డియోల్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఇక ఈయన కోసం స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో నటించడానికి డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీలో తన నటనతో మెప్పించిన బాబి డియోల్ గురించి ఈ మధ్యకాలంలో బీటౌన్ లో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Animal Villain Bobby Deol Love Story

అయితే అప్పట్లో బాబీ డియోల్ తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఒక హీరోయిన్ ని కేవలం తండ్రి కారణంగా వదిలేసుకున్నారట. మరి ఆ హీరోయిన్ ఎవరు..తన తండ్రి ఎందుకు వారి ప్రేమకు అడ్డుపడ్డారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నీలం కఠోరా అనే హీరోయిన్ ని చాలా గాఢంగా ప్రేమించారట.ఇక ఆ హీరోయిన్ కూడా బాబీ డియోల్ ప్రేమలో మునిగిపోయిందట.అలా వీరిద్దరి మధ్య ప్రేమాయణం గురించి అప్పట్లో బీటౌన్ మొత్తం కథలు కథలుగా చెప్పుకుంది.

Also Read: Smartphones: తక్కువ బడ్జెట్‌లో అదిరే కెమెరా ఫోన్స్..!

అయితే వీరి ప్రేమ గురించి బాబీ డియోల్ తండ్రి ధర్మేంద్రకు తెలియడంతో ఈ విషయం తెలిసి ఇంట్లో కొడుకు పై ఫైర్ అయ్యి ఆమెతో ఇంకోసారి కనిపిస్తే నీకు తండ్రి ఉండడు అని వార్నింగ్ ఇచ్చారట. ఇక ఈ వార్నింగ్ తర్వాత బాబి డియోల్ నీలం ని కలవడం మానేశారట. అయితే ఓ ఇంటర్వ్యూలో ధర్మేంద్రని మీ కొడుకు ప్రేమకి మీరే విలన్ అని వార్తలు వినిపిస్తున్నాయి ఇది నిజమేనా అని అడగగా.. నేను నీలంకి శత్రువుని కాదు కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి మా ఇంటి కోడలు కాకూడదు అని నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను.

"Animal" villain Bobby Deol Love story

అంతేకానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అని చెప్పారట. ఇక తండ్రి మాటను కాదనలేక బాబి డియోల్ ఆ హీరోయిన్ ని మర్చిపోయి ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి బిజినెస్ మ్యాన్ అయినా తాన్యా ని పెళ్లి చేసుకున్నారు. అలా తండ్రి మాట కోసం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్ ని సైతం బాబీ డియోల్ ని పక్కన పెట్టారు. ఇక వీరికి సంబంధించిన వార్తలు ఇప్పటికి కూడా బీటౌన్ లో చక్కెర్లు కొడుతూనే ఉంటాయి. (Bobby Deol)

Join WhatsApp