Anjali ex-boyfriend who got married secretly

Anjali: తెలుగు హీరోయిన్ అంజలి అంటే తెలుగులో కంటే కోలీవుడ్ లోనే పాపులర్ అయింది.ఈమె అందచందాలకు తెలుగు దర్శకులు అవకాశాలు ఇవ్వలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం ఈమెకి వరుస అవకాశాలు వచ్చాయి.. అలా కోలీవుడ్లో స్టార్ అయ్యాక తెలుగు వారు అంజలి నటనని గుర్తించి తెలుగులో కూడా అవకాశాలు ఇచ్చారు.అయితే ఇదంతా పక్కన పెడితే అంజలి ఒకప్పుడు ఒక ఓల్డ్ హీరో చేతిలో ప్రేమ పేరుతో మోసపోయింది.

Anjali ex-boyfriend who got married secretly

ఇక ఆ హీరో ఎవరో అందరికీ తెలుసు. ఆయనే జై.. జై అంజలి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి. అలా నటించే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ పెరిగి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అలాగే పెళ్లికి ముందే ఆ హీరో తో సహజీవనం కూడా చేసింది. కానీ ఆ హీరో మోసగాడని తన డబ్బులు అన్నీ ఖర్చు చేసి తనకి అవకాశాలు రాకుండా తెర వెనుక ప్లాన్ వేస్తున్నాడనే విషయం గ్రహించిన అంజలి జై కి బ్రేకప్ చెప్పింది. ఇక అప్పటినుండి జై కూడా అంజలిని పట్టించుకోవడం లేదు. ఇక అంజలి తన సినిమాలు తను చూసుకుంటూ వస్తోంది. (Anjali )

Also Read: Tollywood: నేను నా భర్తతో విడాకులు తీసుకున్న.. కానీ ఇప్పుడు నా కొడుకు మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నాడు.. స్టార్ సింగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇదిలా ఉంటే తాజాగా అంజలి మాజీ ప్రియుడు మరో హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఆ పోస్టులో ఏముందంటే.. కోలీవుడ్ నటి ప్రగ్యా నగారా తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో జై ఆ హీరోని రహస్యంగా పెళ్లాడాడు అని అందరూ భావించారు.కానీ ఆ హీరో నిజంగా పెళ్లి చేసుకోలేదట. ఇది ఒక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ అని తెలుస్తోంది.

Anjali ex-boyfriend who got married secretly

ప్రగ్యా, జై కాంబినేషన్లో బేబీ అండ్ బేబీ అనే కోలీవుడ్ మూవీ వస్తుందట. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అలా ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు, హనీమూన్ వెళుతున్నట్టు ఒక పోస్టు పెట్టారు. ఇక ఈ పోస్ట్ చూసి చాలా మంది నిజంగానే వీళ్లు పెళ్లి చేసుకున్నారా అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. కానీ వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకోలేదు.సినిమా ప్రమోషన్ కోసం అని తెలిసి ఈ సినిమా ఎలా ఉంటుందా చూడాలి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే ఇలా వెరైటీగా సినిమా ప్రమోషన్ చేశారట.ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ఆ ఫోటోలో ప్రగ్య మెడలో పసుపుతాడు అలాగే చేతిలో ఫ్లైట్ టికెట్స్, తో పాటు పాస్ పోర్ట్స్ కూడా ఉన్నాయి.(Anjali )

Join WhatsApp