Another crazy beauty opposite Yash in Toxic

Toxic: కేజిఎఫ్ మూవీతో సీరియల్ హీరోగా ఉన్న యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ మూవీ అనంతరం స్టార్ హీరోలకి మించిన పాపులారిటీ దక్కింది ఈ హీరోకి. అదేవిధంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. పాన్ ఇండియాలో గుర్తింపు పొందిన స్టార్స్ లో అతను కూడా ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు.

Another crazy beauty opposite Yash in Toxic

ఇక ఆయన తదుపరి చిత్రం టాక్సిక్ పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. గీతు మోహన్ దాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఇందులో నయనతార ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందులో మరో పాత్రలో బాలీవుడ్ భామ‌ హ్యౌమా ఖురేషి ఎంపిక అయినట్లు సమాచారం.

Also Read: Varun Sandesh: వరుణ్ సందేశ్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆయనేనా..?

ఇందులో ఈ ముద్దుగుమ్మ పాత్ర పూర్తిగా యాక్షన్ తరహాలో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విఎఫ్ఎక్స్ కు ఎంతో ప్రాధాన్యం ఉందని ఇప్పటికే యష్ తెలిపారు. దానికోసం యూఎస్ఏ లోని కొన్ని ప్రధాన అంతర్జాతీయ వి ఎఫ్ ఎక్స్ స్టూడియో లతో సంప్రదింపులు కూడా జరిపారు.

Another crazy beauty opposite Yash in Toxic

ఇక మూవీని ఇండియా వర్షన్, ఇంటర్నేషనల్ వర్షన్ గా రెండు రూపాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు‌ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇక చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రియల్ 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.(Toxic)

Join WhatsApp