Anupama bold comments

Anupama: తన చింపురు జుట్టుతో మరియు అంద చందాలతో ఆకర్షించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ అనుపమ అని చెప్పుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో ఇలా భారీ పాపులారిటీ దక్కించుకుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ అనుపమ ప్లేస్ ని మాత్రం ఎవ్వరు రీప్లేస్ చేయలేరు.

Anupama bold comments

అంతలా గుర్తింపు పొందింది మరి ఈ ముద్దుగుమ్మ. గతంలో స్టార్ హీరోల సరసన నటించిన మంచి ఫేమస్ అయ్యింది. ఇక ఇటీవలే ఈగల్ మూవీలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం అనుపమ నటిస్తున్న మూవీ టిల్లు స్క్వేర్. ఈమె ఈ మూవీలో ఇచ్చే ఎక్స్పోజింగ్ కి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారనే చెప్పొచ్చు. ఒకప్పుడు ఎంతో పద్ధతిగా అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని అనే వారంతా ఇప్పుడు ఇలా తయారైందేంటి అంటూ విరుచుకుపడుతున్నారు.

Also Read: Prithveeraj: పృధ్వీ ని పెళ్లి చేసుకోలేదు.. అది మాత్రం చేశాం.. కానీ విడిపోయాం.. శీతల్ సంచలన పోస్ట్..!!

అంతలా ఎక్స్పోజింగ్ చేస్తుంది మరి ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్లో పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అక్కడున్న ఒక జర్నలిస్టుని..” మీకు బిర్యాని అంటే ఇష్టమా ” అని ప్రశ్నించింది అనుపమ. ఇక దీనికి ఆ జర్నలిస్ట్ కూడా ఇష్టం అని వెల్లడించాడు. దీంతో..” కానీ మీరు ఇంట్లో ప్రతిరోజు బిర్యాని తింటారా. తినరు కదా.

Anupama bold comments

అలానే నేను కూడా రోజు బిర్యాని తినాలని కోరుకోవడం లేదు. నాకు రోజు డిఫరెంట్ డిఫరెంట్ పులావ్, పులిహార అన్నీ కావాలి ” అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది అనుపమ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట చక్కెరలు కొడుతుంది. ఈ వీడియో చూసిన వారంతా..” చాలా సైలెంట్ గా ఉంటూనే భారీ కొటేషన్ చెప్పేసావుగా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Anupama)

Join WhatsApp