Anupama Parameswaran favorite actor

Anupama: స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ కొనసాగుతుంది.

Anupama Parameswaran Favorite Actor

ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంత అందమైన హీరోయిన్స్‌ వచ్చినప్పటికీ అనుపమ మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడి క్రష్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటుంది. అంతటి పాపులారిటీని సంపాదించుకుంది మరి ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read: Nayanthara: పెళ్లికి ముందు విగ్నేష్ కి అలాంటి కండిషన్ పెట్టిన నయన్… ఈమె డేర్ కి హ్యాట్సాఫ్..!

మీకు టాలీవుడ్ లో ఏ హీరో అంటే ఎక్కువగా ఇష్టం అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి ఈ ముద్దుగుమ్మ సమాధానం ఇస్తూ ..” నాకు మాక్సిమం ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకటే. కానీ ఒక హీరోని మాత్రమే ఫేవరెట్ గా ఎంచుకోవాలి అంటే.. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను.

Anupama Parameswaran favorite actor

నా ఫేవరెట్ హీరో ఐకాన్ స్టార్. నాకు ఆయన అంటే చాలా ఇష్టం ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ తరుణంలోనే ఈమె కామెంట్స్ చూసిన ప్రేక్షకులు..” బన్నీకి పెళ్లైపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈమే చేసుకునేదేమో. అయినా ఐకాన్ స్టార్ అంటే ఇష్టం లేనివాళ్లు ఎవరు ఉంటారులే ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Anupama)

Join WhatsApp