Anushka marraige fix

Anushka: కన్నడ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఎంతోమంది ఈమె అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి ఈమె పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ రానే వచ్చింది అంటున్నారు కొంతమంది జనాలు. మరి ఇప్పటికే చాలాసార్లు అనుష్క పెళ్లి వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఇది కూడా అలాంటి రూమరేనా లేదా నిజమేనా అనే విషయంలో కొంత అనుమాన పడుతున్నారు ఈమె అభిమానులు.

Anushka Marraige Fix

అయితే అనుష్క పెళ్లి జరగాలి అని కోరుకునే అభిమానుల కంటే ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగాలి అని కోరుకునే అభిమానులే ఎక్కువమంది ఉంటారు. అయితే అలాంటి అభిమానులకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అనుష్క, ప్రభాస్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తుంది. కానీ దానికి వ్యతిరేకంగా తాజాగా కన్నడ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే అనుష్క శెట్టి ఓ స్టార్ నిర్మాతతో పెళ్లికి రెడీ అయిపోయిందట. మరి ఇంతకీ అనుష్క పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..(Anushka )

Also Read: Nayanatara: గుళ్లో అలాంటి పూజ చేసిన నయనతార విగ్నేష్.. కారణం విడాకులేనా..?

ఇండస్ట్రీకి రాకముందు ఎంతో మంది సెలబ్రిటీలకు యోగ టీచర్ గా పనిచేసిన అనుష్క శెట్టి సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా మొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో అనుష్కకు మంచి గుర్తింపు లభించింది.ఇక ఇండస్ట్రీలో అనుష్క కి స్టార్ హీరోయిన్ గుర్తింపు లభించింది మాత్రం అరుంధతి మూవీ తోనే. ఈ సినిమా వల్ల అనుష్క శెట్టి కెరియర్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత దాదాపు అందరూ స్టార్ హీరోలతో జతకట్టింది.

Anushka marraige fix

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇంకా ఒంటరి జీవితాన్నే గడుపుతుంది. అయితే తాజాగా కన్నడ మీడియా నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అనుష్క శెట్టి కన్నడ నిర్మాత ని పెళ్లి చేసుకోబోతుందట. అయితే ఆ నిర్మాత పేరు బయటపడకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం మీడియాలో వైరల్ అవ్వడంతో అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోయే ఆ నిర్మాత ఎవరబ్బా అని నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.(Anushka )

Join WhatsApp