Anushka Shetty true nature reveal make-up man

Anushka Shetty: సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క సినిమాల్లోకి రాకముందు కొన్ని సీరియల్స్ అలాగే సెలబ్రిటీలకు యోగ టీచర్ గా పని చేసేది.అలా సోనుసూద్,పూరి జగన్నాథ్ కారణంగా ఈమెకు సూపర్ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. ఇక అనుష్క కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అరుంధతి అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాతో అనుష్కకి ఎక్కడలేని క్రేజ్ తెచ్చి పెట్టింది. అలా ఇప్పటివరకు తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే అలాంటి అనుష్క గురించి ఆమె మేకప్ మాన్ సంచలన విషయాలు బయట పెట్టారు. అనుష్క కి ఒకప్పుడు మేకప్ మెన్ గా చేసిన మేకప్ మెన్ రామ చంద్ర రావు.

Anushka Shetty true nature reveal make-up man

అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో అనుష్క గురించి మాట్లాడుతూ.. హీరోయిన్ అనుష్క ఎంతో మంచి మనస్తత్వం కలది. తన ముందు ఎవరైనా సరే ఆపదలో ఉంటే అస్సలు ఊరుకోదు.అంతేకాదు ఎవరికి ఏ బాధ వచ్చినా తనకే వచ్చినట్లు ఫీల్ అవుతుంది. తన వంతుగా వారికి ఏదైనా సహాయం చేస్తుంది.మొహమాటానికి కాదు ఆమె హార్ట్ ఫుల్ గా ఏ పనైనా చేస్తుంది. చాలా జెన్యూన్ పర్సన్..అలాగే సెన్సిటివ్ గా ఉంటుంది. సినిమాల్లో నటించే సమయంలో కూడా డబ్బు గురించి నిర్మాతలను ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టదు. (Anushka Shetty)

Also Read: Prabhas: లండ‌న్ లో విలాస‌వంత‌మైన ఇల్లు తీసుకున్న ప్ర‌భాస్‌.. ఒక్క నెల రెంట్ తెలిస్తే మ‌తిపోతుంది!

అలాగే అనుష్కలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీకి దొరకడం ఒక వరం అని చెప్పుకోవచ్చు. అనుష్క తన ముందు ఉండే వారి క్యారెక్టర్ ఎలాంటిదో చిటికెలోనే కనిపెడుతుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంది. అనుష్కలాంటి అమ్మాయిలు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు.ఇక నేను అనుష్క చేసిన కొన్ని సినిమాలకు మేకప్ మెన్ గా చేశాను. ఆ తర్వాత ఆమె నటించిన పంచాక్షరి మూవీకి నిర్మాతగా చేశాను. ఈ సినిమాలో చేసే సమయంలో రెమ్యూనరేషన్ ముందు కొంచమే ఇచ్చాను.

Anushka Shetty true nature reveal make-up man

ఆ తర్వాత సినిమా హిట్ అయ్యాక మిగిలినది ఇచ్చేసాను.అయినా కూడా నన్ను డబ్బుల విషయంలో ఇబ్బంది పెట్టలేదు అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో అనుష్క తనతో ఎక్కువగా మాట్లాడడం లేదని,మెసేజ్ లు చేసినా..ఫోన్ చేసినా కూడా రియాక్ట్ అవడం లేదని కానీ మా మధ్య ఎలాంటి గొడవ కూడా జరగలేదని, అనుష్క మాత్రం ఇలా ఎందుకు దూరం పెడుతుందో అర్థం అవ్వడం లేదు అంటూ ఆ మధ్యకాలంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేకప్ మెన్ రామచంద్రారావు ఈ విషయాలన్నీ పంచుకున్నారు.(Anushka Shetty)

Join WhatsApp