Anushka Shetty's marriage with that cricketer

Anushka Shetty: సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి గత రెండు సంవత్సరాల నుండి పెళ్లి వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఈమె పెళ్లిపై ఎన్నో వార్తలు వినిపించినా కూడా ఒక్కసారి కూడా ఈమె పెళ్లి వార్త నిజం కాలేదు.అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఈ సంవత్సరంలో అనుష్క శెట్టి పెళ్లికి సిద్ధమైనట్టు సినీ ఇండస్ట్రీలో టాక్. అయితే ప్రభాస్ అనుష్క మధ్య ఏదో నడుస్తోందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ ఉంది.

Anushka Shetty’s Marriage with that Cricketer

కానీ ప్రభాస్ ఇన్ని సంవత్సరాలైనా అనుష్కతో పెళ్లి పీటలెక్కడం లేదు.దాంతో ప్రభాస్ తో రిలేషన్ లో ఉండి విసిగిపోయిన అనుష్క తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో మరో క్రికెటర్ తో ప్రేమలో పడిందట.అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ క్రికెటర్ ని కలిసిన అనుష్క శెట్టి అప్పట్నుండి ఆయనతో ఫోన్లు మాట్లాడుతూ ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకొని ఇంట్లో వాళ్లకు తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసిందట.

Also Read: Keerthi Suresh: త్వరలోనే ఆ స్టార్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కనున్న కీర్తి సురేష్.. మరి ఆ లక్కీ పర్సన్ ఎవరంటే..!

అయితే ఈ మధ్యనే ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒత్తిడి చేయడంతో తాను ఓ క్రికెటర్ ని ప్రేమిస్తున్నానని, తనకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పిందట.ఇక ఈ విషయంలో అనుష్క కుటుంబ సభ్యులు కూడా సంతోషపడ్డారట. ఎందుకంటే తమ కూతురు పెళ్లి ఇంకా జరగడం లేదని ఎంతోమంది వారిని హేళనగా మాట్లాడుతున్నారట.కానీ ఈ సమయంలో అనుష్క శెట్టి గుడ్ న్యూస్ చెప్పడంతో ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారట.

Anushka Shetty's marriage with that cricketer

ఇక ఇంట్లో వాళ్ళు ఓకే చేయడంతో ముంబైలో ఆ క్రికెటర్ తో కలిసి అనుష్క శెట్టి ఒకే రూమ్ లో ఉంటుందని కూడా మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అనుష్క శెట్టి ఆ క్రికెటర్ మ్యారేజ్ ఏప్రిల్ లో జరగబోతుందని, ఫిబ్రవరిలో వీరిద్దరికి సింపుల్ గా ఎంగేజ్మెంట్ జరుగుతుందని టాక్. అయితే ఆ క్రికెటర్ పేరు మాత్రం అనుష్క శెట్టి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.(Anushka Shetty)

Join WhatsApp