Ashika Ranganath Mahesh Babu Love Story

Ashika Ranganath: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈ సినిమా అంతగా హిట్ అవ్వక పోయినప్పటికీ ఈ సినిమాలో ఆషిక అందానికి నటనకి మంచి మార్కులు పడ్డాయి.అలా తెలుగులో రెండో చిత్రమే స్టార్ హీరో నాగార్జున తో చేసే అవకాశం వచ్చింది.ఇక ఈ సంక్రాంతికి వచ్చిన నా సామి రంగ మూవీలో నాగార్జున సరసన ఆడి పాడింది. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో వరాలు అనే పేరుతోనే ప్రస్తుతం ఈమెకు మంచి ఇమేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు.

Ashika Ranganath Mahesh Babu Love break up

అయితే అలాంటి హీరోయిన్ ఆషికా రంగనాథ్ కి మహేష్ బాబుకి మధ్య లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. ఆషిక రంగనాథ్ మహేష్ బాబు మధ్య లవ్ బ్రేకప్ అంటే అందరూ సూపర్ స్టార్ మహేష్ బాబు అని అనుకుంటారు. అయితే మీరు కూడా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక మహేష్ బాబు అంటే తెలుగు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు కన్నడ టాప్ డైరెక్టర్లలో ఒకరైన డైరెక్టర్ మహేష్ బాబు.. ఈయన దర్శకత్వంలోనే ఆషికా రంగనాథ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.(Ashika Ranganath)

Also Read: Venkatesh: ” దృశ్యం ” మూవీ వెంకటేష్ రెండో కూతురు గుర్తుందా.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

ఇక ఆషిక రంగనాథ్ బెంగళూరులో జరిగే క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది బెంగళూరు కాంటెస్ట్ లో పాల్గొని విన్నయ్యింది.అలా ఈ పోటీలో ఆషికా రంగనాథ్ ను చూసిన డైరెక్టర్ మహేష్ బాబు తన సినిమా క్రేజీ బాయ్ లో ఆషికా ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు కూడా మహేష్ బాబు దర్శకత్వంలోనే చేసింది. అలా వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ పెరిగి ఇద్దరు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండేవారట.

Ashika Ranganath Mahesh Babu Love Story

అయితే ఓ సినిమా చేసే సమయంలో ఆషిక రంగనాథ్ కి మరో హీరోతో ఉన్న క్లోజ్నెస్ చూసి డైరెక్టర్ మహేష్ బాబు కోపగించుకున్నారట. అంతేకాదు ఆ తర్వాత తనని తన దర్శకత్వంలో వచ్చే సినిమాలలో తీసుకోలేదట. ఇక అప్పటినుండి ఆషిక మహేష్ బాబుకి బ్రేకప్ చెప్పి తమిళ సినిమాల వైపు వెళ్ళింది. ఇక తమిళంలో చేసినా కూడా ఈమెకు గుర్తింపు రాకపోవడంతో చివరికి తెలుగులో అమీగోస్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.(Ashika Ranganath)

Join WhatsApp