August 15 Box Office Clash: Allu Arjun,NTR and Six Heroes

August 15 Box Office: ఈ మధ్య సినిమాల విడుదల తేదీల విషయంలో నిర్మాతలు ముందు చూపు వహిస్తూ మంచి డేట్స్ ను లాక్ చేసుకుంటున్నారు. గతంలో కేవలం పండగ సమయాల్లో మాత్రమే ఈ విధంగా ఆలోచించే వారు. కానీ ఇప్పుడు మంచి లాంగ్ వీకెండ్ వస్తే దాన్ని తమ సినిమా కోసం ఆక్యుపై చేసుకునే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. అలా ఆరునెలల తర్వాత రాబోయే ఓ వీకెండ్ కోసం పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా పోటీ పడుతున్నారు.

August 15 Box Office Clash: Allu Arjun,NTR and Six Heroes

ఆగస్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ చేసుకోవడానికి పెద్ద హీరోలు, చిన్న హీరోలు అని లేకుండా ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆ రోజున రావాలని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యాడు. అయన సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న పుష్ప 2 సినిమా ను ఆగస్టు 15 న రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం ఆ సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ తేదీలో తాను రావాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు.(August 15 Box Office)

Also Read: Tata Motors: అదిరిపోయే ఫీచర్స్‌ తో టాటా టియాగో, టైగోర్ CNG కార్లు..ధర ఎంతంటే ?

కొరటాల తో కలిసి చేస్తున్న దేవర పార్ట్ 1 సినిమా ఏప్రిల్ 5 నుండి వెళ్ళిపోయింది. దాదాపుగా ఇది ఖరారు అయినట్లే. అయితే మంచి డేట్ కోసం చూస్తున్న ఎన్టీఆర్ కి ఆగస్టు 15 ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ డేట్ ఎన్టీఆర్ కి దొరుకుతుందా చూడాలి. ఆలోపు ఈ సినిమా కంప్లీట్ అయితే మాత్రం ఈ లాంగ్ వీకెండ్ ను ఎన్టీఆర్ అస్సలు వదులుకోరు.

వీరిద్దరూ మాత్రం కాదు. కొంతమంది చిన్న హీరోలు, ఇతర భాషల హీరోలు కూడా ఈరోజును టార్గెట్ చేస్తున్నారు. నాని హీరో గా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా ను ఆరోజునే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ఇద్దరిలో ఎవరు రాకపోతే తనోస్తానని హల్చల్ చేస్తున్నాడు. వీరు మాత్రమేనా.. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా, సూర్య కంగువా అలాగే విక్రమ్ తంగలాన్ సినిమాలు కూడా ఆగస్టు 15 వస్తే ఎలాగుంటుందా అని చూస్తున్నారు. మరి ఆరోజున విడుదలయ్యే సినిమాలు ఏంటో చూడాలి.

Join WhatsApp