Avasarala Srinivas Says Keerthy Suresh Was Wrong Choice For Mahanati

Keerthy Suresh: మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఇప్పటివరకు చేసిన అద్భుత చిత్రాల్లో మహానటి మూవీ మొదటి స్థానంలో ఉంటుంది. అలనాటి తార సావిత్రి బయోపిక్ ఇది. నాగ అశ్విన్ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ నటించింది. దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, సమంత, నాగచైతన్య, రాజేంద్రప్రసాద్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషించారు.

Avasarala Srinivas Says Keerthy Suresh Was Wrong Choice For Mahanati

2018 మే 9న విడుదలైన మహానటి చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. మహానటి చిత్రానికి ప్రధాన బ‌లం కీర్తి సురేష్. సావిత్రి పాత్రలో ఆమె పరికాయ ప్రవేశం చేసి నటించింది. సావిత్ర‌లో అల్లరి, చిలిపి తనం, కరుణ‌, భ‌యం, ప్రేమ కోపం ఇలా ప్రతి రసాన్ని కీర్తి సురేష్ వెండితెర‌పై అద్భుతంగా పలికించింది. తెరమీద సావిత్రి నే చూస్తున్నామా అన్నంతగా మెప్పించింది.

Avasarala Srinivas Says Keerthy Suresh Was Wrong Choice For Mahanati

విమర్శకులు సైతం కీర్తి సురేష్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఉత్తమ నటిగా మహానటి చిత్రానికి గానూ కీర్తి సురేష్ జాతీయ అవార్డును సైతం అందుకుంది. అలాంటి కీర్తి సురేష్ పై నటుడు అవసరాల శ్రీనివాస్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. మహానటి చిత్రానికి కీర్తి సురేష్ రాంగ్ ఛాయిస్ అంటూ వ్యాఖ్యానించాడు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా త‌న‌కంటూ ఇండ‌స్ట్రీలో స్పెష‌ల్ ఇమేజ్ ను సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు.(Keerthy Suresh)

Also Read: Sai Pallavi: టాలీవుడ్ లో సాయి ప‌ల్ల‌వికి ఉన్న ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రో తెలుసా?

ఈ ఇంట‌ర్వ్యూలో మ‌హాన‌టి మూవీ ప్ర‌స్థావ‌న రాగా.. అవ‌స‌రాల కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. మ‌హాన‌టిలో లీడ్ రోల్ ను ఫిక్స్ చేయ‌క‌ముందే నాగ్ అశ్విన్ నన్ను ఎల్వి ప్రసాద్ రోల్ చేయ‌మ‌ని అడిగారు. నేను ఓకే అన్నాను. ఆ త‌ర్వాత సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. అప్పటి వరకు కీర్తి సురేష్ అంటే కమర్షియల్ హీరోయిన్ అన్న భావ‌న‌లోనే నేను ఉన్నారు. అందువ‌ల్ల మ‌హాన‌టికి కీర్తి రాంగ్ ఛాయిస్ అనుకున్నాను. కానీ కొద్ది రోజుల త‌ర్వాత ఫస్ట్ లుక్ తో పాటు కొన్ని పోస్టర్స్ విడుద‌ల చేశారు. అవి చూశాక నా అభిప్రాయం త‌ప్ప‌ని తేలింది. ఇక సినిమా చూశాకా కీర్తి న‌ట‌న‌కు ఫిదా అయిపోయాను. ఆమె ఎంతో అద్భుతంగా న‌టించింది అంటూ అవ‌స‌రాల చెప్పుకొచ్చారు. దీంతో ఆయ‌న కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Join WhatsApp