Balakrishna first love

Balakrishna: నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ తరఫున రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నందమూరి ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు నిలబెడుతున్నారు. రాజకీయాల్లో అలాగే సినిమాల్లో సక్సెస్ అయినా బాలకృష్ణ గురించి ఒక ఆశ్చర్యపోయే నిజం ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే.. బాలకృష్ణ మొదట ఎవర్ని ప్రేమించారు.. ఆ అమ్మాయితో ప్రేమ పెళ్లి ఎలా మొదలైంది. అసలు బాలకృష్ణ మొదటి ప్రేమలో జరిగిన ట్విస్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Balakrishna first love

బాలకృష్ణ మొదట ప్రేమించిన అమ్మాయి అంటే ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అని అనుకుంటారు చాలామంది. కానీ బాలకృష్ణ తొలిచూపులో ప్రేమించింది ఎవరినో కాదు ఆయన భార్య వసుంధరినే.అవును మీరు వినేది నిజమే.బాలకృష్ణ ఓసారి తన బంధువుల ఫంక్షన్ కి వెళ్ళిన సమయంలో ఆ ఫంక్షన్ లో మొదటిసారి వసుంధర ని చూసారట.ఇక తొలిచూపులోనే వసుంధర ప్రేమలో మునిగిపోయారట బాలకృష్ణ.(Balakrishna )

Also Read: Sivaji: శివాజీ తో రొమా** చేస్తే అస్సలు ఫీలింగ్ రాలేదు.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్..!

అయితే ఆ విషయం వసుంధరకి ఎలా చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డ సమయంలో సడన్ గా బాలకృష్ణకి పెళ్లి చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారట. ఇక తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా బాలకృష్ణ పెళ్లి చూపులకు వెళ్లారట.కానీ ఇక్కడ బాలకృష్ణకి అదిరిపోయే ట్విస్ట్ ఎదురైందట. అదేంటంటే.. బాలకృష్ణ ఫంక్షన్ లో చూసిన అమ్మాయి ఆయన పెళ్లి చూపుల్లో చూడవలసిన అమ్మాయి ఇద్దరు ఒకటే. ఆమెనే వసుంధర..అయితే వసుంధర నందమూరి ఫ్యామిలీకి దూరపు బంధువట.

Balakrishna first love

అలా సీనియర్ ఎన్టీఆర్ తన కొడుకుకి వసుంధరని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారట. అయితే ఈ విషయం ముందుగా తెలియని బాలకృష్ణ చాలా బాధపడిపోయినప్పటికి పెళ్లి చూపుల్లో వసుంధరని చూసి ఎంతగానో సంబరపడిపోయారట.ఇక పెళ్లిచూపులు అయినప్పటినుండి పెళ్లి చేసుకునే వరకు చాలా సార్లు వీళ్ళు ఫోన్లో మాట్లాడుకుని ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకున్నారట. అలా వీరి పెళ్లి జరిగిపోయిందని బాలకృష్ణ ఓ సందర్భంలో తన ఫస్ట్ లవ్ వసుంధరనే అంటూ చెప్పుకొచ్చారు.(Balakrishna )

Join WhatsApp