Balakrishna, Mokshajna, who is in love with Tarakaratna's children

Balakrishna: నందమూరి తారకరత్న చనిపోయిన అనంతరం ఆయన కుటుంబ సభ్యుల బాధ్యతని బాలయ్య తీసుకుంటున్నారని గతంలో అనేక రూమర్స్ వినిపించాయి. ఇక వారి పిల్లల బాధ్యతలు అన్ని బాలకృష్ణ నే చూసుకుంటున్నట్లు పలువురు చెప్పుకొచ్చారు కూడా. ఇక మునిపెన్నడు లేనివిధంగా బాలయ్య తొలిసారి తారకరత్న ఫ్యామిలీతో దర్శనమిచ్చాడు.

Balakrishna, Mokshajna, who is in love with Tarakaratna’s children

బాలయ్యతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా తారకరత్న కుటుంబాన్ని పలకరించేందుకు వెళ్లాడు. తారకరత్న పిల్లలతో బాలయ్య మరియు మోక్షజ్ఞ ఉన్న ఫోటోలని భార్య అలేఖ్య తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేకాకుండా..” నేను ఏ వైపు ఉన్నానని నన్ను ఎప్పుడు అడుగుతూ వస్తున్నారు.

Also Read: Kareena Kapoor: నేను రిజెక్ట్ చేయడం వల్లే దీపిక పదుకొనే రణ్ వీర్ కి భార్య అయింది..!

దానికి సమాధానం మానవత్వం, ప్రేమ, ముఖ్యంగా నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలయ్య) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు మరియు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము ” అంటూ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకొచ్చింది అలేఖ్య. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Balakrishna, Mokshajna, who is in love with Tarakaratna's children

ఇక ఈ ఫోటోలను చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతుంటే మరి కొందరు మాత్రం..” ఇప్పటివరకు గుర్తుకురాని తారకరత్న ఫ్యామిలీ ఇప్పుడు ఒక్కసారిగా గుర్తుకొచ్చేసిందా? ఓట్లు సమయం దగ్గర పడడంతో ఈ విధంగా చేస్తున్నారు కదా? అయినా ఆమె కామెంట్స్ చూస్తనే ఈ విషయం అర్థం అవుతుంది ” అంటూ గోరంగా తిడుతున్నారు.(Balakrishna)

Join WhatsApp