Bigg Boss Faima Had Love With Serial Hero

Faima: కొన్ని కామెడీ షో ల ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది కమెడియన్స్ గా..సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. మరి కొంతమంది అయితే యాంకర్స్ గా.. ఇంకొంతమంది సినిమాల్లో కీలకపాత్రల్లో, కమెడియన్స్ గా.. విలన్ గా.. కొంతమంది డైరెక్టర్స్.. హీరోలుగా..కూడా మారిపోతున్నారు.అయితే అలాంటి వారందరూ పటాస్, జబర్దస్త్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక పటాస్ షో ద్వారా ఫేమస్ అయిన పటాస్ ఫైమా జబర్దస్త్ కామెడీ షో లో కూడా చేసి జబర్దస్త్ ఫైమా గా మారిపోయింది.

Bigg Boss Faima Had Love With Serial Hero

అంతేకాదు ఈమె బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో అందరినీ మెప్పించింది. అయితే అలాంటి ఫైమా జబర్దస్త్ షోలో చేస్తున్న సమయంలో ప్రవీణ్ తో ప్రేమాయణం నడిపించిన సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో స్కిట్లు కూడా వచ్చాయి.అంతేకాదు వీరిద్దరూ తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని చాలాసార్లు బయట పెట్టారు కూడా. కానీ గత కొద్ది రోజులుగా ఫైమా, ప్రవీణ్ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.(Faima)

Also Read: Mahesh Babu: నమ్రత బర్త్డే రోజు మహేష్ బాబు సర్ప్రైజ్ గిఫ్ట్..ఏంటో తెలుసా..?

అయితే తాజాగా వీరి ప్రేమా, బ్రేకప్ గురించి శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిలు అడిగారు. ఫైమా ప్రవీణ్ ఎందుకు కలిసి ఉండడం లేదు అని అడగగా ప్రవీణ్ ఫైమానే నన్ను దూరం పెట్టింది అని చెప్పాడు. అలాగే ఆ షోలో ఉన్న జడ్జిలు ప్రవీణ్ ని ముట్టుకోమని ఫైమా కి చెబితే ఫైమా కనీసం టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అయితే తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఫైమా తన లవర్ గా ప్రవీణ్ ని కాకుండా మరో వ్యక్తిని పరిచయం చేసింది.

Bigg Boss Faima who had an love with a serial hero

ఇక ఆయన ఎవరో కాదు సీరియల్ నటుడు,బిగ్ బాస్ కంటెస్టెంట్ రాజ్.. బిగ్ బాస్ 6 లో తన తోటి కంటెస్టెంట్ అయిన రాజ్ ను చూపించి ఇతడే నా లవర్ అని చెప్పింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఫైమా నిజంగానే సీరియల్ హీరోని ప్రేమించిందా.. అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. కానీ కొంతమందేమో ఇది మొత్తం స్కిట్లో భాగమేనని, ఎంటర్టైన్ చేయడం కోసమే ఫైమా అలా చెప్పిందని కామెంట్లు పెడుతున్నారు.(Faima)

Join WhatsApp