Biography of Uday Kiran directed by RGV

Uday Kiran: ప్రస్తుత కాలంలో ఒక స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ బయోగ్రఫీ తీయడం కామన్ అయిపోయాయి. ఆనాటితరం వాళ్లని వారి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది సావిత్రి మరియు సీనియర్ ఎన్టీఆర్ వంటి వారికే సాధ్యం కాదు ఇండస్ట్రీలో తక్కువ కాలం కొనసాగినప్పటికీ మంచి పాపులారిటీ దక్కించుకున్న వారికి కూడా సాధ్యమవుతుంది.

Biography of Uday Kiran directed by RGV

ప్రస్తుతం మన మధ్య లేని వారి బయోగ్రఫీ తీస్తూ ప్రశంసల వర్షం కురిపించుకుంటున్నారు డైరెక్టర్స్‌. ఈ క్రమంలోనే ఆర్జీవి కూడా ఓ స్టార్ హీరో బయోగ్రఫీ తీసేందుకు రెడీ అయ్యాడు. ఆ హీరో మరెవరో కాదు ఉదయ్ కిరణ్. ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన ఈయన ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరం. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ బయోగ్రఫీ రూపొందుతుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది.

Also Read: Prabhas: సినిమా అంటేనే ఇష్టం లేని ప్రభాస్ ఇండస్ట్రీలో ఎందుకు అడుగు పెట్టాడు?… కారణమేంటి..?

కానీ దీనిపై మాత్రం ఇప్పటివరకు ఏ క్లారిటీ రాలేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఉదయ్ కిరణ్ బయోగ్రఫీ ఆర్జీవి డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాంట్రివర్షియల్ కామెంట్స్ చేస్తూ నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తూ ఉండే ఆర్జీవి కనుక ఈ బయోగ్రఫీ డైరెక్ట్ చేస్తే పక్క బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర డైరెక్టర్ ఆ బయోగ్రఫీ వ్యక్తి లైఫ్ లో జరిగిన కొన్ని సన్నివేశాలను చూపించడానికి మొహమాట పడతారు.

Biography of Uday Kiran directed by RGV

కానీ ఆర్జీవికి మాత్రం అది అస్సలు ఉండదు. ఏం జరిగిందో తూచా తప్పకుండా చూపిస్తూ ప్రశంసలు వర్షం కురిపించుకుంటాడు. ఇక గతంలో ఉదయ్ కిరణ్ లైఫ్ లో మెగా ఫ్యామిలీ ఉన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి మరియు ఉదయ్ కిరణ్ కి మధ్య ఉండే కలహాలు ఎక్కడ చూపిస్తారో అని ప్రస్తుతం మెగా ఫ్యామిలీ కంగారు పడుతుందట. ఇక ఇదే వార్త కనుక నిజం అయితే మెగా ఫ్యామిలీ యొక్క అసలు రూపం బయట పడుతుందని చెప్పుకోవచ్చు.(Uday Kiran)

Join WhatsApp